దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకంపై సిఎస్ సమీక్ష


తేదీ : 03-10-2019
అమరావతి


దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకంపై సిఎస్ సమీక్ష


అమరావతి,3 అక్టోబరు: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లోడును మెరుగు పర్చడం,లోఓల్టేజి సమస్యను అధికమించేందుకు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకం కింద చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పథకంపై రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో మెరుగుదలకు ఏఏ ప్రాజెక్టుల కింద ఎంత మేరకు పెట్టుబడులు పెడుతున్నాము వాటి ద్వారా ఎంత మేరకు ఫలితాలు వస్తున్నాయనే దానిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాజెక్టులను నిర్ణీత గడువు ప్రకారం సకాలంలో పూర్తి చేసి ప్రజలకు మంచి ప్రయోజనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పలానా ప్రాజెక్టు పూర్తయిన పిదప విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని వినియోగదారులు స్టెబిలెజర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా హామీ ఇచ్చే రీతిలో వివిధ విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సిఎస్ స్పష్టం చేశారు.అదే విధంగా నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు సంబంధించి పూర్తి భరోసాను ఇచ్చేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని అన్నారు. అంతేగాక కాస్ట్ బెనిఫిట్ రేషియోను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఏప్రాజెక్టు చేపట్టడం ద్వారా ఎంతవరకూ ప్రయోజనం కలుగుతుందీ పూర్తిగా అవగాహన కలిగించాలని సిఎస్ సుబ్రహ్మణ్యం ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. కాగా రాష్ట్రంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన పధకం అమలుకు సంబంధించి రూ. 521.54 కోట్లు మంజూరు కాగా గ్రామీణ విద్యుదీకరణ, నాన్ ఆర్ఇ కాంపొనెంట్ కింద విద్యుత్ ఉప కేంద్రాలు, డిటిఆర్ మీటర్లు, హెచ్విడిఎస్ తదితర పనులకు ఇప్పటికే 404 కోట్లు రూ.లు ఖర్చు చేయగా మిగతా 117 కోట్ల 54 లక్షల రూ.లు ఖర్చు చేసేందుకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద ఎపిఎస్పిడిసిఎల్ పరిధి కింద 8జిల్లాల్లో అదనంగా 33/11 కెవి సామర్ధ్యంతో కూడిన 66 ఉప విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు ద్వారా విద్యుత్ లోడ్ సామర్థ్యాన్ని పెంచడం, లో ఓల్టేజి సమస్యను తగ్గించడం వంటి చర్యలు చేపడుతున్నారు.
 
ఈ సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, ఎపిఇపిడిసిఎల్ డైరెక్టర్ ప్రాజెక్ట్సు రాజ బాపయ్య, ఎపి ఎస్పిడిసిఎల్ డైరెక్టర్ టెక్నికల్ టి.వనజ, ఆర్ఇసి ప్రతినిధి వెంకటేశన్, అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి డా.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.


........


Popular posts
*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం
అంబెడ్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ysrcp నేత దేవినేని ఆవినాష్
Image
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.