బుధవారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం

అమరావతి: 


రాష్ట్ర మంత్రిమండలి సమావేశం బుధవారం జరుగనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీపై సమీక్షిస్తారు. ఇనామ్‌ భూములకు సంబంధించి ముఖ్య నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రిటైర్డ్‌ ఉద్యోగులకు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించి సిద్ధం చేసిన మార్గదర్శకాలను కేబినెట్‌ ఆమోదిస్తుందని అంటున్నారు. అయితే కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు సంబంధించి ఇటీవలి ఉత్తర్వులో స్పష్టత లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వైఎస్‌ హయాంలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులుగా నియమితులైనవారు కూడా ఈ ఉత్తర్వు ప్రకారం ఉద్వాసనకుగురి కావలసిన పరిస్థితి నెలకొంది. ఈ అంశంపైనా కేబినెట్‌ భేటీలో స్పష్టత ఇచ్చే వీలుంది.