గోడ పత్రిక ఆవిష్కరణ

భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో నవంబర్ మూడవ తారీకున చేపట్టిన లాంగ్ మార్చ్ విజయవంతం చేయాలని బెంజ్ సర్కిల్ వద్ద భవన నిర్మాణ కార్మికుల తో కలిసి గోడ పత్రికను రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ బతిన రాము మరియు ముత్తంశెట్టి  ప్రసాద్ గారు విడుదల చేసినారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్పో పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్ర ప్రజలు ఉపాధి లేక చేతిలో డబ్బులు ఆరక అనేక ఇక్కట్లు పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రంలో అమావాస్య చీకట్ల అలుముకున్నాయి అని అందుకే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు అమావాస్యకు అసలు పుత్రుడు అవినీతికి దత్తపుత్రుడు అని అంటున్నారని, భవన నిర్మాణ కార్మికులకు వెంటనే 10 వేల రూపాయలు చెల్లించాలని , టన్ను ఇసుకను 100 రూపాయలకే అందించాలని, ఇసుక మాఫియా అరికట్టాలని డిమాండ్ చేస్తూ నిన్న సీఎం గారు ఇసుకపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో వారు స్వయంగా  ఇసుక అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతు౦ది, అని దీని పై వెంటనే రాష్ట్ర డిజిపి గారు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అంటేనే, రాష్ట్రంలో ఇసుక మాఫియా రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే నడుస్తుందని ఇసుక ను రాష్ట్ర ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టించి సిమెంట్ కంపెనీల ద్వారా కమీషన్ల పొందిన తరువాత మాత్రమే ఇసుక ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా కుట్రలు పన్నారని మహేష్ ఆరోపించారు. తూర్పు ఇంచార్జ్ బత్తిన రాము మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 486 విడుదల చేయడం అంటేనే రవాణా రంగాన్ని కుదేలు చేసే విధంగా కుట్రపన్నుతోందని లారీ యజమానులు డ్రైవర్లు క్లీనర్లు ఇసుక కొరత వలన పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం జీవో నెంబర్ 486 ద్వారా 6000 లారీలను అదనంగా కొనుగోలు చేసి  ఇసుక రవాణాకు వినియోగించుకొని లారీ యజమానులను డ్రైవర్లను కార్మికులను రోడ్డున పడేసిన కుట్రపన్నుతోందని ఇటువంటి కుట్రలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు . అదేవిధంగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ ను విజయవంతం చేయాలని అందుకు భవన నిర్మాణ కార్మికులు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమాo లో తమ్మన. లీలా, వెన్న .శివ శంకర్, రావి. సౌజన్య, గుట్టుపల్లి సంతూష్, రాజేష్, విజయ లక్ష్మి తదితరులు  పాల్గొన్నారు.