చంద్రబాబు ఎన్నో దేవాలయాలను కూల్చేశారు: మంత్రి వెల్లంపల్లి
అమరావతి : టీడీపీ హయాంలో దేవాదాయ భూములు అన్యాక్రాంతమయ్యాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. సూరాయపాలెంలో 10 ఎకరాలను బినామీలకు కట్టబెట్టారన్నారు. అలాంటి జీవోలను రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆలయాల భూముల పరిరక్షణకు ఐపీఎస్ అధికారితో కమిటీ వేస్తామన్నారు. భూముల వివరాలను రిజిస్ట్రేషన్ శాఖకు పంపుతామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు దేవాలయాలంటే విలువ లేదని... విజయవాడలో అనేక ఆలయాలను కూల్చేశారని ఆరోపించారు. అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
చంద్రబాబు ఎన్నో దేవాలయాలను కూల్చేశారు: మంత్రి వెల్లంపల్లి