స్పందన బాగానే జరుగుతోంది: సీఎం

*29–10–2019*
*అమరావతి


స్పందన బాగానే జరుగుతోంది: సీఎం


*అమరావతి: స్పందనపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష* 
*స్పందనపై వస్తున్న నివేదిక  ప్రకారం కార్యక్రమం బాగా సాగుతోంది: సీఎం*
*ఎక్కువ శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు: సీఎం*
*వినతుల పరిష్కారంలో నాణ్యత ఉండడానికి చర్యలు చేపట్టాం: సీఎం*
*దీనిపై అధికారులకు శిక్షణ కూడా ఇచ్చాం : సీఎం*
*వచ్చే వినతుల్లో అధికభాగం ఇళ్లపట్టాలు, రేషన్‌కార్డులు, పెన్షన్లు అంశాలే ఎక్కువగా ఉన్నాయి: సీఎం*
*( స్పందన కింద ఇప్పటివరకూ అందిన వినతులు 6,99,548, పరిష్కరించినవి 5,57, 553 (80 శాతం), పెండింగ్‌ వినతులు 49,337, తిరస్కరించినవి 92, 656)*


*వినతుల పరిష్కారంలో నాణ్యతపై ప్రత్యేక దృష్టి:*


*సీఎం కార్యాలయం నుంచి సెక్రటరీ సాల్మన్‌తో పాటు మరికొంతమంది సిబ్బంది జిల్లాలకు వెళ్తారు:*
*కొంతమంది పోలీసు అధికారులు ఈ బృందంలో ఉంటారు:*
*ఎమ్మార్వోలు, మున్సిపల్‌కమిషనర్లని,  క్షేత్రస్థాయిలో అధికారులను కలుస్తారు:* 
*ప్రజలు సంతృప్తివ్యక్తంచేసేలా వినతులను ఎలా పరిష్కరించాలన్నదానిపై ప్రణాళికలను వారికి వివరిస్తారు:*
*స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్స్‌పై వీరు పనిచేస్తారు:*
*నవంబర్‌ 5 నుంచి ఈకార్యక్రమం ఉంటుంది:*


స్పందనపై వచ్చే వినతులను నాణ్యతతో పరిష్కరించగలిగినప్పుడే కలెక్టర్లు, ఎస్పీలకు మంచిపేరు వస్తుంది: 
నా కళ్లు చెవులు, కలెక్టర్లు, ఎస్పీలే:
మీ పనితీరు బాగుంటే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది:


అవినీతి అన్నది కనిపించకూడదు :


ఎమ్మార్వో , మున్సిపల్‌ కమిషనర్‌ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్లలో అవినీతి అన్నది లేకుండా చూడాలి: సీఎం
కలెక్టర్లు, ఎస్పీలు క్రియాశీలకంగా వ్యవహరించినప్పుడే ఇది సాధ్యం:
మీరు నవ్వుతూ ప్రజలను ఆహ్వానించినప్పుడు యాభైశాతం సంతృప్తి వస్తుంది:
అవినీతి లేనప్పుడు మిగిలిన యాభైశాతం సంతృప్తి వారికి లభిస్తుంది:


*గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు:*కొత్త పెన్షన్లు, కొత్త రేషన్‌ కార్డులు, కొత్త ఇళ్లస్థలాలపై ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించండి:
దీనివల్ల సోషల్‌ఆడిట్‌ జరుగుతుంది: సీఎం
ఒకవేళ అర్హత ఉండీ ఎవరిపేరైనా జాబితాలో లేకపోతే.. వారు ఎవరికి, ఎలా, దరఖాస్తు చేయాలి? అన్న వివరాలు కూడా ఉండాలి:
ఎవరెవరికి అర్హత ఉంటుందన్నదానిపై ప్రొసీజర్‌కూడా గ్రామ సచివాలయాల దగ్గర ఉంచాలి: 
లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు, రేషన్‌కార్డులు, పెన్షన్లు పలానా తేదీనుంచి ఇస్తామని లేఖ కూడా ఇవ్వండి:
దీనివల్ల ప్రజలకు ఎప్పటినుంచి అవి అందుతాయన్నదానిపై అవగాహన ఉంటుంది,  అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా పథకాలు అందరికీ అందుతాయి: 


*జనవరి 1 నాటికి పూర్తిస్థాయిలో గ్రామ సచివాయాలు:*


డిసెంబర్‌15 నాటికి గ్రామ సచివాలయాలు పనిచేయడం ప్రారంభించాలి:
కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్, లామినేషన్‌ యంత్రం తదితర సామగ్రి అంతా సెక్రటేరియట్‌లో ఉండాలి:
లోటుపాట్లు సరిదిద్దుకుని జవనరి 1 నుంచి పూర్తిస్థాయిలో సచివాలయాలు పనిచేయాలి:
జనవరి 1 నుంచి రేషన్‌ కార్డులు, పెన్షన్‌కార్డులు గ్రామ సచివాలయాల్లోనే ప్రింటింగ్‌ చేసి ఇచ్చేలా వ్యవస్థ ఉండాలి:
ఈమేరకు కలెక్టర్టు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి:
గ్రామ సెక్రటేరియట్‌ పక్కనే, ప్రభుత్వానికి సంబంధించిన ఏ బిల్డింగునైనా గుర్తించి... అందులో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అమ్మాలి:
ప్రభుత్వం ధృవీకరించే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మేలా చూడాలి:
అంతేకాక రైతులకు ఉత్తమ వ్యవసాయ విధానాలపై శిక్షణ ఇచ్చేలా ఉండాలి:


*నవంబరు నెలలో కీలక పథకాలు :*


డిసెంబర్‌ 3న వైయస్సార్‌ లా నేస్తం ప్రారంభం:
కంటివెలుగుకు సంబంధించి రెండో విడత కార్యక్రమం నవంబర్‌ 2 నుంచి అవుతుంది: 
69.03 లక్షలమంది పిల్లల్లో 65.03 లక్షల మందికి కంటి పరీక్షలు చేశారు:
ఇందులో 4.3 లక్షల మంది పిల్లలకు కంటికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్నారు:
ప్రభుత్వ స్కూలు సముదాయాల్లోనే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం:
5 కి.మీ. పరిధిలో ఒక స్కూలు సముదాయాన్ని ఎంపిక చేసుకుంటారు:
రెండోదశలో భాగంగా పిల్లలకు మరింత స్క్రీనింగ్‌ చేసి, వారికి కంటిఅద్దాలు ఇస్తారు:
మొత్తంగా 500 బృందాలు ఇందులో పాలుపంచుకుంటాయి
ప్రతి టీంలో పారా మెడికల్‌ అప్తాలమిక్‌ అసిస్టెంట్, పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్, ఆశా వర్కర్‌ ఉంటారు:
నవంబర్‌ 20 నుంచి కంటి అద్దాల పంపిణీకి ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు*ప్రభుత్వాసుపత్రుల్లో 500 రకాల మందులు:*
నవంబర్‌ 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లో ఆరోగ్యశ్రీ అమలు: సీఎం
దాదాపు 130 ఆస్పత్రులు ఇప్పటివరకూ ఎంపానెల్‌ అయ్యాయి:
గుర్తించిన సూపర్‌ స్పెషాలిటీ సేవలు ఇందులో లభిస్తాయి:


ప్రభుత్వాసుపత్రుల్లో కూడా 500 రకాల మందులు లభిస్తాయి:
నవంబర్‌ 20 నుంచి ఆస్పత్రులకు పంపిణీ ప్రారంభం అవుతుంది:
నవంబర్‌ 30 నాటికి అన్ని ఆస్పత్రులకూ అందుబాటులోకి వస్తాయి:
నవంబర్‌ 20 నుంచి కలెక్టర్లు ఆస్పత్రులను తనిఖీచేయాలి:
ఎక్కడైనా మందుల కొరత ఉందని గుర్తిస్తే వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయండి:


*నవంబర్‌ 7న అగ్రిగోల్డ్‌ బాధితులకు పేమెంట్లు:*


నవంబర్‌ 7న అగ్రిగోల్డ్‌ బాధితులకు సంబంధించి పేమెంట్లు విడుదల:
రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసినవారికి సుమారు రూ.264 కోట్లు, 3,69,655 మంది బాధితులకు అందిస్తున్నాం:
దీనికి సంబంధించిన బిల్స్‌ను కలెక్టర్లు నవంబర్ 2లోగా  సమర్పించాలి: సీఎం
సొంతంగా ఆటోలు, కార్లు నడుపుకుంటున్నారికి రూ.10వేలు ఇచ్చే కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే.. వారికి పథకం వర్తించేలా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలి:


*నవంబర్‌ 14 నుంచి పాఠశాలల్లో నాడు– నేడు:*


నవంబర్‌ 14న పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం ప్రారంభం: 
తొలివిడతలో 15వేలకు పైగా స్కూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు, వచ్చే ఏడాది మార్చి 30 కల్లా పూర్తి :
బాత్‌రూం, నీళ్లు, ఫర్నిచర్, బ్లాక్‌ బోర్డ్, కాంపౌండ్‌ వాల్, ఫినిషింగ్, పెయింట్స్, ఫ్యాన్లు.. ఈ సదుపాలయాన్నీ ప్రతి స్కూల్లో ఉండాలి:
వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకూ ఇంగ్లిషు మీడియం:
ఆతర్వాత ఏడాది 9 వ తరగతి, ఆ మరుసటి ఏడాది 10వ తరగతిలో ఇంగ్లిషు మీడియం:


*నవంబర్‌ 21న మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్,* 
సముద్రంలో వేట చేసే కుటుంబానికి రూ.10వేలు:
 
నవంబర్‌ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం: 
లీటరు డీజిలు మీద రూ. 6.03 ఉన్న సబ్సిడీ రూ.9ల కు పెంచాం:
దీనికి సంబంధించి 81 పెట్రోలు బంకులను గుర్తించాం:
డీజిలు పట్టించుకున్నప్పడే మనం సబ్సిడీ కూడా ఇస్తాం:
గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు:


వేట నిషేధ సమయంలో రూ.4వేలు గతంలో ఉండేది: సీఎం
అదికూడా సక్రమంగా ఇచ్చేవారు కాదు:
వేట నిషేధ సమయంలో ఎన్నికలు వచ్చాయి కాబట్టి, నవంబర్‌ 21న ఈ డబ్బును ఇస్తున్నాం:
సముద్రంలో వేటకు వెళ్లే ప్రతికుటుంబానికి రూ.10వేలు ఇస్తున్నాం:
గతంలో మెకనైజ్డ్, మోటారైజ్డ్‌ బోట్లకు మాత్రమే ఇచ్చే వారు:
ఇప్పుడు సముద్రంలో వేటకు వెళ్లే తెప్పలకూ దీన్ని వర్తింపుచేస్తున్నాం: 
1,32,332  కుటుంబాలు ఈపథకం వల్ల లబ్ధి పొందుతారు:
ముమ్మడివరంలో ఈపథకం ప్రారంభోత్సవంలో నేను పాల్గొంటాను :
అలాగే అక్కడ మత్స్యకారులకు ఓఎన్జీసీ ఇవ్వాల్సిన డబ్బుకూడా ప్రభుత్వం తరఫున అందిస్తాం:


*ఇళ్లపట్టాల పంపిణీపై ప్రత్యేక దృష్టి:*


ఇళ్లపట్టాల పంపిణీలో భాగంగా ఇప్పటివరకూ 22,79,670 లబ్ధిదారులను గుర్తించారు:
దేశం మొత్తం ఈ పథకంవైపు చూస్తుంది:
గతంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద  ఎత్తున పట్టాలు ఇవ్వలేదు:
శాచ్యురేషప్‌ పద్ధతిలో ఇల్లులేని ప్రతి ఒక్కరికీ ఇళ్లస్థలం ఇస్తున్నాం:
ప్లాటింగ్‌ చేసి ఇంటి స్థలం ఎక్కడున్నదీ చూపిస్తాం:
మహిళల పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నాం:
ఈ కార్యక్రమంపై కలెక్టర్లు 3 నెలల పాటు కార్యాచరణ ప్రణాళికను తయారుచేసుకోవాలి:
లబ్దిదారుల జాబితాను గ్రామ సెక్రటేరియట్‌లో ప్రదర్శించాలి:
సాధ్యమైనంత మేర అర్బన్‌ ప్రాంతాల్లో ఇళ్లస్థలమే ఇవ్వడానికి ప్రయత్నించండి:
ఫ్లాట్ల నిర్వహణ వల్ల చాలా సమస్యలు ఉన్నాయి:
ఎక్కడ లీకైనా మొత్తం ఇబ్బంది పడతారు:
ఇళ్లస్థలం ఇస్తే.. ఎవరివారే తమ ఇంటిని భద్రంగా చూసుకుంటారు:అర్బన్‌ ప్రాంతాల్లో అభ్యంతరంలేని ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి వరకూ 1 రూపాయికే రిజిస్ట్రేషన్‌చేయిస్తామని చెప్పాం:
2 సెంట్లనుంచి 6 సెంట్ల వరకూ నిర్దేశిత విలువ ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించడంపై ప్రతిపాదనలు తయారుచేయన్నాం:
అభ్యంతరం ఉన్న , అభ్యంతరం లేని వర్గీకరణ స్పష్టంగా ఉండాలి:
అభ్యంతరం ఉన్న ప్రాంతాల్లో ఉంటున్నవారికి ఇళ్లస్థలాలు కేటాయించి, వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలి: సీఎం
కాల్వగట్లమీద, నదీతర ప్రాంతాల్లో ఉంటున్నవారికి మొదటి విడతలోనే ఇళ్లుకట్టించి, వారిని తరలించాలి:
ఇలాంటివారికోసం సుమారు 6 లక్షలు ఇళ్లు అవసరం అవుతుందని అంచనా:


*గ్రామవాలంటీర్‌ పోస్టుల భర్తీ:*


అర్బన్‌లో 19వేలు, రూరల్‌లో 9వేల గ్రామ వాలంటీర్‌ పోస్టులు ఖాళీ ఉన్నాయి:
నవంబర్‌ 3వ వారానికి ఖాళీలను భర్తీచేయాలి:
గ్రామ వాలంటీర్‌ పోస్టులు ఖాళీగా ఉండకూడదు:
గ్రామ సెక్రటేరియట్‌ పోస్టుల్లో ఖాళీలన్నీ కూడా ఈ వారాంతంలోపు భర్తీచేయాలి:


*రైతు భరోసా మీద వచ్చేవారం దృష్టి:*


రైతు భరోసా మీద కలెక్టర్లు దృష్టిపెట్టాలి: సీఎం
నవంబర్‌ 15 రైతు భరోసాకు ఆఖరు తేదీ:
ఆధార్‌ సీడింగ్‌లో పొరపాట్లు, ఇతరత్రా సమస్యలను నివారించాల్సి ఉంది:
1.87లక్షలమంది రైతుల బ్యాంకు అక్కౌంట్లు క్లోజ్‌ అయిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వచ్చిన అధికారులు
వాటిని తెరిపించి రైతుభరోసా లబ్ధి అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడి
4.89 లక్షలమంది రైతులకు ఆధార్‌ తప్పుగా నమోదయ్యిందని సీఎం దృష్టికి తీసుకు వచ్చిన అధికారులు, సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి


వచ్చే వారం కలెక్టర్లుపూర్తిగా రైతు భరోసామీద దృష్టిపెట్టాలి: సీఎం
రైతు భరోసాలో సోషల్‌ ఆడిటింగ్‌ బాగా జరుగుతోంది:
నవంబర్‌ 15కు తుది జాబితాలు ఖరారు చేయాలి:
రైతు భరోసాతోఆపటు సొంతంగా ఆటోలు, డ్రైవర్లు నడుపుకుంటున్న వారికీ ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకుంటున్నవారికి గడువు పెంచాం:
దీనిమీద కూడా కలెక్టర్లు దృష్టిపెట్టాలి: సీఎం


వర్షాలు బాగు కురిశాయని, ఎక్కడా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూసుకున్నామన్న అధికారులు
కల్తీ లేకుండా చూసుకుంటున్నామని చెప్పిన అధికారులు
కలెక్టర్లు, ఎస్పీలు సీరియస్‌గా తీసుకుంటే.. కల్తీలేకుండా ఉంటుంది: సీఎం


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image