విద్యారంగంలో సంస్కరణల కమిటీతో సీఎం సమీక్ష

29–10–2019
సచివాలయం


*విద్యారంగంలో సంస్కరణల కమిటీతో సీఎం సమీక్ష*
*తమ సిఫార్సులను ముఖ్యమంత్రికి వివరించిన కమిటీ*
*సిఫార్సుల అమల్లోకూడా కమిటీ భాగస్వామ్యం కొనసాగాలన్న సీఎం*
*రూ.5 కోట్ల ఖర్చుతో 1200 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రికి వెల్లడించిన డా. సుధానారాయణమూర్తి*


అమరావతి: విద్యారంగంలో సంస్కరణలపై తమ సిఫార్సులను సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు వివరించిన ప్రొఫెసర్‌ ఎన్‌.బాలకృష్ణన్‌ నేతృత్వంలోని కమిటీ
కమిటీ సిఫార్సులపై సుదీర్ఘంగా చర్చించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌
పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యలపై తమ సిఫార్సులను సీఎంకు వివరించిన ప్రొఫెసర్‌ ఎన్‌.బాలకృష్ణన్‌


సమావేశంలో సీఎం వ్యాఖ్యలు:


వచ్చే ఏడాది 1 నుంచి 8 తరగతి వరకూ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నాం: సీఎం
దీనికి సంబంధించి పాఠ్యప్రణాళికను వెంటనే తయారుచేయాల్సి ఉంది
విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండేలా చూడాలి
స్కూల్స్‌కు సంబంధించి చూస్తే టీచర్లకు సరైన శిక్షణ ఇవ్వాలి
స్కూళ్లను ఇంగ్లిషు మీడియంలోకి మారుస్తున్నాం
దీనికోసం మంచి పాఠ్యప్రణాళిక రూపొందించాలి
స్కూళ్లలో ప్రారంభించిన నాడు –నేడు కార్యక్రమం కొనసాగాలి
ఆతర్వాత కూడా వాటి నిర్వహణ బాగుండాలి
ఇవన్నీకూడా సక్రమంగా చేయగలిగితే... మంచిమార్పులు వస్తాయి
45వేల స్కూళ్లలను అభివృద్దిచేస్తున్నాం:
పిల్లలకోసం ఏర్పాటు చేసే ఫర్నిచర్‌ క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దు:
పాఠ్యప్రణాళిక చాలా బలోపేతంగా ఉండాలి:


 


ప్రై వేటు స్కూల్స్‌ ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలుచేస్తున్నాయి:
ప్రై వేటు స్కూళ్లలో ఉన్న నాణ్యత, ప్రమాణాలను కూడా పరిశీలించాలి:
దీనిపైకూడా నియంత్రణ కూడా ఉండాలి:
నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఈ పరిశీలన చేయాలి:
విద్య అన్నది ఆదాయం కోసం కాదు:
ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో క్వాలిటీని పరిశీలించాలి, పర్యవేక్షించాలి:
దీనిపై మార్గదర్శకాలు విడుదల చేయాలి:
అగ్రికల్చర్‌ కాలేజీకి 100 ఎకరాలు ఉంటేనే అనుమతి ఇవ్వాలి:
కాని, రాష్ట్రంలోని ప్రై వేటు అగ్రికల్చర్‌ కాలేజీల్లో ఈ భూమి ఉండడం లేదు కదా? ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు:
దీనిపై రెగ్యులేటరీ కమిషన్‌ నియంత్రణచేయాలి:
ప్రై వేటు జూనియర్‌ కాలేజీల్లో సరైన సదుపాయాలు, ప్రమాణాలు లేకున్నా నడుస్తున్నాయి:
ప్రమాణాలను ఉల్లంఘించిన వాటిని మూసివేయాలి:
వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది, దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది
కాలేజీల్లో పాఠ్యప్రణాళిక కూడా మార్చాలి:
కచ్చితంగా ఒక సంవత్సరం అప్రెంటిస్‌ కాలేజీల్లో ఉండాలి:
చదువు అనేది కచ్చితంగా ఉపాధి లేక ఉద్యోగం కల్పించాలి:


ప్రైవేటు యూనివర్శిటీల్లో నాణ్యతాప్రమాణాలపై మనం నియంత్రణ చేయలేనప్పుడు వాటిని ఎందుకు ప్రోత్సహించాలి?:
వారి ప్రమాణాలను తనిఖీచేసే అవకాశం లేనప్పుడు ఎందుకు ప్రోత్సహించాలి:
ప్రైవేటు యూనివర్శిటీల్లో క్వాలిటీ లేనప్పుడు వారిచ్చే సర్టిఫికెట్లకు ఏం వాల్యూ ఉంటుంది:
ప్రైవేటు యూనివర్శిటీల పాఠ్యప్రణాళికమీదగాని, ప్రమాణాలమీదగాని  నియంత్రణ ఉండనప్పుడు ఏం ఉపయోగం?:


అసలు కొంతమంది ప్రైవేటు కాలేజీలను ఎందుకు నడుపుతున్నారు?
వారి లక్ష్యాలు ఏంటి?
డబ్బు సంపాదనా?లేక మంచి విద్యను అందించాలన్న అన్నదానిపై స్పష్టత ఉండాలి
విద్య అనేది వ్యాపారం కోసం, డబ్బుకోసం కాదు. ఇది ఒక ఛారిటీ:
విద్య అనేది డబ్బుకోసం కాదని చట్టమే చెప్తోంది:
ప్రాథమిక, ఉన్నత విద్యా రంగాల్లో ఈ అంశాన్ని బలంగా చెప్పేలా ఉండాలి:


ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీచేయాలి:
కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇవ్వాలి:
లేకపోతే వ్యవస్థలు కూలిపోతాయి:
కాలక్రమంలో మనం దీన్ని విస్మరించాం:
కాని ఇప్పుడు బాధ్యతను తీసుకుని వీటిని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం:


వీటన్నింటిమీదా కమిటీ దృష్టి పెట్టాలి:
కమిటీలో ఉన్న వారంతా ప్రముఖులు, విద్యావేత్తలు
కమిటీ కేవలం సిఫార్సులు ఇవ్వడంలోనేకాదు, అమలులో కూడా భాగస్వాములు కావాలి, మనం అనుకున్న లక్ష్యాలను చేరాలి
ఈ కమిటీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెగ్యులేటరీ కమిషన్లతో నిరంతరం చర్చించాలి:
తీసుకొస్తున్న సంస్కరణలు, అమలుచేస్తున్న విధానాలమీద రెగ్యులేటర్‌ కమిషన్‌కు తెలియజేయాలి
విద్యాశాఖలోని అధికారులు వారధిలా పనిచేయాలి: సీఎం
విద్యారంగంలో సంస్కరణలపై పనిచేస్తున్న కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా: సీఎం


విజయవాడలో ప్రైవేటు కాలేజీలో ఆకస్మిక తనిఖీల అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చిన విద్యాశాఖ అధికారి
ఐపీఎల్‌ అంటూ ఐఐటీ పరీక్షలకోసం ప్రీమియర్‌ లీగ్‌ పెడుతున్నారన్న అధికారులు
చాలా ఉల్లంఘనలు కనిపించాయని సీఎం దృష్టికి తీసుకు వచ్చిన అధికారి
ఫీజుల వసూలులో కూడా రూ. 40వేల నుంచి రూ.1 లక్ష రూపాయల వరకూ వసూలు చేస్తున్నారన్న అధికారులు
కాని ప్రభుత్వానికి మాత్రం రూ.2వేలు మాత్రమే వసూలు చేస్తున్నట్టుగా చూపిస్తున్నారన్న అధికారులు
ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు


కమిటీ సభ్యులు వ్యాఖ్యల :


డాక్టర్‌ సుధా నారాయణమూర్తి, ఛైర్‌పర్సన్, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌
మా ఫౌండేషన్‌ తరఫున రూ.5 కోట్లు ఖర్చుచేసి 1200 మంది టీచర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రిగారు చెప్పిన విధంగా
ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టగానే ప్రభుత్వ విద్యారంగంలో తప్పకుండా మంచి మార్పులు వస్తాయి. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంగ్లిషు మీడియం చదవాలనుకుంటున్నారు.


వెంకటరెడ్డి, ఎంపీ ఫౌండేషన్‌
నా జీవిత కాలంలో విద్యారంగంలో మార్పులు తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేశాం. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగారి నాయకత్వంలో విద్యారంగంలో గొప్ప మార్పులు చూడగలుగుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.