గ్రేడ్ వన్ సాధనకు కృషి చేసిన గూడూరు ఎం.ఎల్.ఎ,ఎం.పి మరియు నాయకులకు చారిటబుల్ ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు

💥గూడూరు💥


గూడూరు మున్సిపాలిటీ గ్రేడ్ వన్ సాధించిన సందర్భంగా కనుమూరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత కనుమూరి హరిశ్చంద్రా రెడ్డి తన స్వగృహంలో విలేకార్లు సమావేశం ఏర్పాటు చేసి గూడూరు మున్సిపాలిటీ గ్రేడ్ వన్ సాధనకు కృషి చేసిన గూడూరు ఎం.ఎల్.ఎ,ఎం.పి మరియు నాయకులకు చారిటబుల్ ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు తెలిపారు,
గ్రేడ్ వన్ సాధించాలంటే జనాభా ప్రాతిపదికన  లక్ష వరకు జనాభా,మరియు 6 కోట్లు వరకు, టాక్స్ బ్రాకెట్ లో మనం గ్రేడ్ వన్ సాధించామని చుట్టుపక్కల గ్రామాలైన చెన్నూరు, దివిపాలెం, పోటుపాలెం, పురిటిపాలెం లాంటి పంచాయతీ లు కలుపుకుని లక్ష జనాభా ఐతే మలి అడుగు సాధించి కేంద్ర ప్రభుత్వ అమృత పథకం సాధించు కుంటే ఎన్నో నిధులు వచ్చి గూడూరు అభివృద్ధి చెందుతుందని అలాగే ప్రతి సంవత్సరం స్టేట్ గవర్నమెంట్ 5,6 మున్సిపాలిటీలను అమృత పథకంకి రెఫర్ చేస్తుందని దాన్లో ఐనా మన గూడూరు మలి అడుగు వేస్తామని అలాగే గ్రేడ్ వన్ సాధనకు మొదలుపెట్టిన రెండు నెలల్లోనే గ్రేడ్ వన్ సాదించుకోవడం ఆనందంగా ఉందని గ్రేడ్ వన్ వలన మౌలిక వసతులు పెరిగి ప్రజలకు మరిన్ని సౌకర్యాలు వస్తాయని చెప్పారు...