వి.ఆర్ కాలేజీలో మంత్రి అనీల్ పర్యటన

 


నెల్లూరు అక్టోబర్ 29 (అంతిమతీర్పు):


 


🔹 నేడు వి.ఆర్. కళాశాలని గౌ|| జలవనరులశాఖా మంత్రివర్యులు డా|| పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు సందర్శించి మౌళిక వసతులపై ఆరాతీశారు.  


🔹 నగర నడిబొడ్డులో ఇంతటి కళాశాల నెల్లూరు నగరంలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. వి.ఆర్. కళాశాలని మరింత అభివృద్ధి చేసి చూపిస్తా. మంత్రి అనిల్ కుమార్ యాదవ్.     


🔹 వి.ఆర్. కళాశాల చరిత్రలో ఒక మంత్రి వి.ఆర్. కళాశాలకు వచ్చి ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నేను ఉన్నాను, నేను  విన్నాను, నేను చేస్తాను అన్న ఒకేఒక మంత్రి డా|| అనిల్ కుమార్ యాదవ్ గారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 వి.ఆర్. కళాశాల అభివృద్ధి బాధ్యతలు నూతన కమిటి ఏర్పడేదాకా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి అప్పజెప్పిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 


🔹 ఇందులో అన్ని రాజకీపార్టీలను, ప్రజా సంఘాలను, మేధావుల సమన్యయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని కోరిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.