డిపాజిట్ల పై కన్ను వేసిన ప్రస్తుత  ఈవో సురేష్ బాబు - పోతిన మహేష్

అర్హత లేని వ్యక్తి కోసం అమ్మ స్థాయిని తగ్గిస్తారా
అమ్మవారి  ఫిక్స్డ్ డిపాజిట్ల పై కన్ను వేసిన ప్రస్తుత  ఈవో సురేష్ బాబు - పోతిన మహేష్
 
  విజయవాడ:        ఆదివారం వన్ టౌన్ గణపతి రావు రోడ్డులో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మహేష్ మాట్లాడుతూ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పై ఈవో గా బాధ్యతలు  నిర్వహించాలంటే వారికి తప్పనిసరిగా ఆర్.జె.సి క్యాడర్ ఉండాలని ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ.వో. సురేష్ బాబు గారి అర్హత చాలదని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నందు పిటిషన్ విచారణలో ఉండగా ఎండోమెంట్ శాఖ అక్రమంగా వారం రోజుల్లో మూడు రకాలైన ఉద్యోగ స్థాయిని  ఈవో సురేష్ బాబు గారికి ఎండోమెంట్ కమిషనర్ గారు మరియు సెక్రటరీ గారు పేర్కొన్నారని దానిలో నవంబర్ 2న జాయింట్ కమిషనర్ గా, నవంబర్ 6న తాత్కాలిక డిప్యూటీ కమిషనర్ గా మరియు  నవంబర్ 7న సెక్రటరీ ఉషా రాణి గారు జీవో నెంబర్ 891 మార్పు చేస్తూ డిప్యూటీ కమిషనర్ గా చూపించడం అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎంత గుడ్డిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అవినీతికి కొమ్ము కాస్తున్నారో  అర్దమవుతుందని అదేవిధంగా ఒక అర్హత లేని వ్యక్తి కోసం దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కనకదుర్గమ్మ వారి స్థాయిని తగ్గించి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుందని ఇదంతా దేనికోసం  చేస్తున్నారో మంత్రి  సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. అమ్మవారికి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల పై కన్ను వేసిన ప్రస్తుత  ఈవో సురేష్ బాబు  దేవస్థాన అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ ముసుగులో ఫిక్స్డ్ డిపాజిట్ల విత్ డ్రా చేయాలని ఒక కొత్త  మోసానికి తెరలేపారని అందుకే గతంలో జీతాలు, ఖర్చులు చెల్లించకుండా ఆ డబ్బు మొత్తాన్ని  ఫిక్స్ డిపాజిట్ల రూపంలో బ్యాంకులో జమ చేసారని ఒక కొత్త వాదాన్ని తెరమీదికి తీసుకొచ్చారన్నారు. అమ్మవారి  స్థాయిని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదని ఫిక్స్డ్ డిపాజిట్లను విత్ డ్రా చేసి అమ్మవారి  ఆదాయానికి, ఆస్తులకు గండికొట్టే ప్రయత్నం చేస్తే అమ్మవారి భక్తులు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని  మహేష్ హెచ్చరించారు. వైయస్సార్సీపి మంత్రులు, ఎమ్మెల్యేలు పాలన చేతకాక ప్రజా సమస్యలపై ప్రజల తరపున పోరాడుతున్నందుకు పవన్ కళ్యాణ్ గారిపై  విమర్శలు చేస్తున్నారన్నారు,.వైయస్సార్సీపి ప్రభుత్వం  ఇసుక వారోత్సవాలు కు బదులు ఇసుక  మాఫియా వారోత్సవాలు చేసుకోవాలని, ఇసుక కొరతను సృష్టించి వైఎస్ఆర్సిపి నాయకులు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకున్నారని, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను చూసి కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చలించడంలేదని   ముఖ్యమంత్రి గారికి నిజంగా కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్పందించి భవన నిర్మాణ కార్మికులకు నెలకు పది వేల రూపాయల చొప్పున ఐదు నెలలకు ఆర్థిక సాయం చేయాలని టన్ను ఇసుకను 100 రూపాయలకే అందించాలని డిమాండ్ చేశారు.
 


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు
వైసీపీ నేతల ఇసుక అక్రమాలను నిరూపిస్తా..