తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న కృష్ణా,గుంటూరు జిల్లాల టిడిపి నాయకులు
'' ఇసుక కృత్రిమ కొరత-వైసిపి ప్రభుత్వ హత్యలకు'' నిరసనగా ఈ నెల 14న విజయవాడలో 12గంటల దీక్ష.
35లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సమస్యపై వైసిపి నేతల నిర్లక్ష్యం.
ఇంత పెద్ద ఎత్తున ఆత్మహత్యలు గతంలో రాష్ట్ర చరిత్రలో లేవు. ఇన్ని ఆత్మహత్యాయత్నాలు రాష్ట్రంలో మున్నెన్నడూ జరగలేదు.
స్పందనలో వినతులు ఇచ్చిన చేతులతోనే పురుగుమందు తాగుతున్నారు. ఎమ్మార్వో,ఎండివో కార్యాలయాలకు పెట్రోల్ సీసాలతో వెళ్తున్నారు. వైసిపి వేధింపులు భరించలేకే ఆవేదనతో జనం ఈ పనులకు పాల్పడుతున్నారు. ఈ పెడ ధోరణులకు వైసిపి నేతల అరాచకాలే కారణం.
నిన్న పెద్దడోర్నాలలో ఇద్దరు మహిళా ఉద్యోగుల ఆత్మహత్యాయత్నాలు బాధాకరం. ఉద్యోగాలు తొలగిస్తామన్న వేధింపులే దీనికి కారణం.
పేదల కడుపుకొట్టి వైసిపి కార్యకర్తల పొట్టలు నింపుతున్నారు.
వీవోఏల జీతాలు ఒక చేత్తో పెంచారు, మరో చేత్తో వారిని ఉద్యోగాలనుంచి తీసేస్తున్నారు.
వైసిపి కార్యకర్తలకు ఉద్యోగాల కోసం మరొకరి పొట్ట కొట్టడం అమానుషం.
డ్వాక్రా సంఘాలను స్వతంత్రంగా పనిచేసేలా టిడిపి ప్రభుత్వం చేసింది. ఎన్టీఆర్ హయాంలోనే మ్యాక్స్ చట్టం తెచ్చాం. దీని ప్రకారం ఆయా సంఘాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదు.
నిర్ణయాలను ఆయా సంఘాలే స్వతంత్రంగా తీసుకోవాలి. 20ఏళ్లుగా పనిచేస్తున్నవాళ్లను తొలగించడం అన్యాయం.
6,400మంది పశుసఖిలను రోడ్డుమీదకు నెట్టారు. 27వేల సంఘమిత్రల జీవితాలతో ఆడుకుంటున్నారు. వారం రోజులుగా పశుసఖిలు నిరాహార దీక్షలు చేస్తున్నా స్పందన లేదు. మహిళా సాధికారత కోసం టిడిపి చేసిన కృషిని నీరుగార్చారు.
ఇసుక కొరత అనేది గతంలో ఏపి చరిత్రలోనే లేదు. ఆహార కొరత, విద్యుత్ కొరత, గ్యాస్ కొరత, నీటి కొరత విన్నాం కానీ, ఇసుక కొరత ఇప్పుడే చూస్తున్నాం. లేని ఇసుక కొరత సమస్యను వైసిపి నేతలే సృష్టించారు. తమ అక్రమార్జనలకు ఇసుకను ఆదాయ వనరుగా చేశారు.
ఎరువులు, పురుగు మందుల బ్లాక్ మార్కెటింగ్ గురించి గతంలో విన్నాం. ఇసుక బ్లాక్ మార్కెటింగ్ గురించి ఇప్పుడే చూస్తున్నాం. 5రెట్ల అధిక ధరలకు ఇసుక విక్రయాలు చేస్తున్నారు. తీయాల్సిన దానికన్నా 5రెట్లు తక్కువ తీస్తున్నారు. కృత్రిమ కొరతను ,బ్లాక్ లో విక్రయాలను ప్రోత్సహించారు.
విజయవాడ దీక్ష ప్రకటన చేశాక ఇసుక అందుబాటు స్వల్పంగా పెంచారు. 14నుంచి ఇసుక వారోత్సవాల ప్రకటన అందులో భాగమే.
వైసిపి నేతలే చెన్నై,బెంగళూరు,హైదరాబాద్ కు ఇసుక అక్రమ రవాణా. లారీ ఇసుక రూ.80వేల నుంచి రూ.లక్షకు అమ్మడం చరిత్రలో ఉందా...?
వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి రాజీలేని పోరాటం. భవన నిర్మాణ కార్మికులకు అండగా టిడిపి ఉంటుంది.
వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి పోరాట కమిటి ఏర్పాటు.
ఇసుక కొరతపై బొండా ఉమామహేశ్వర రావు నేతృత్వంలో టిడిపి పోరాట కమిటి ఏర్పాటు. సభ్యులుగా అచ్చెన్నాయడు, రామానాయుడు,వర్ల రామయ్య,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అఖిలప్రియ,ఆలపాటి రాజేంద్ర ప్రసాద్,బండారు సత్యనారాయణ మూర్తి.
ఈ నెల 14న ఇసుక దీక్షతో అయినా వైసిపి ప్రభుత్వానికి కనువిప్పు కావాలి.
మొద్దునిద్ర నుంచి వైసిపి నేతలు మేల్కొనాలి.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ పాల్గొన్న కృష్ణా,గుంటూరు జిల్లాల టిడిపి నాయకులు ‘‘ ఇసుక కృత్రిమ కొరత-వైసిపి ప్రభుత్వ హత్యలకు’’ నిరసనగా ఈ నెల 14న విజయవాడలో 12గంటల దీక్ష. 35లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సమస్యపై వైసిపి నేతల నిర్లక్ష్యం. ఇంత పెద్ద ఎత్తున ఆత్మహత్యలు గతంలో రాష్ట్ర చరిత్రలో లేవు. ఇన్ని ఆత్మహత్యాయత్నాలు రాష్ట్రంలో మున్నెన్నడూ జరగలేదు. స్పందనలో వినతులు ఇచ్చిన చేతులతోనే పురుగుమందు తాగుతున్నారు. ఎమ్మార్వో,ఎండివో కార్యాలయాలకు పెట్రోల్ సీసాలతో వెళ్తున్నారు. వైసిపి వేధింపులు భరించలేకే ఆవేదనతో జనం ఈ పనులకు పాల్పడుతున్నారు. ఈ పెడ ధోరణులకు వైసిపి నేతల అరాచకాలే కారణం. నిన్న పెద్దడోర్నాలలో ఇద్దరు మహిళా ఉద్యోగుల ఆత్మహత్యాయత్నాలు బాధాకరం. ఉద్యోగాలు తొలగిస్తామన్న వేధింపులే దీనికి కారణం. పేదల కడుపుకొట్టి వైసిపి కార్యకర్తల పొట్టలు నింపుతున్నారు. వీవోఏల జీతాలు ఒక చేత్తో పెంచారు, మరో చేత్తో వారిని ఉద్యోగాలనుంచి తీసేస్తున్నారు. వైసిపి కార్యకర్తలకు ఉద్యోగాల కోసం మరొకరి పొట్ట కొట్టడం అమానుషం. డ్వాక్రా సంఘాలను స్వతంత్రంగా పనిచేసేలా టిడిపి ప్రభుత్వం చేసింది. ఎన్టీఆర్ హయాంలోనే మ్యాక్స్ చట్టం తెచ్చాం. దీని ప్రకారం ఆయా సంఘాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదు. నిర్ణయాలను ఆయా సంఘాలే స్వతంత్రంగా తీసుకోవాలి. 20ఏళ్లుగా పనిచేస్తున్నవాళ్లను తొలగించడం అన్యాయం. 6,400మంది పశుసఖిలను రోడ్డుమీదకు నెట్టారు. 27వేల సంఘమిత్రల జీవితాలతో ఆడుకుంటున్నారు. వారం రోజులుగా పశుసఖిలు నిరాహార దీక్షలు చేస్తున్నా స్పందన లేదు. మహిళా సాధికారత కోసం టిడిపి చేసిన కృషిని నీరుగార్చారు. ఇసుక కొరత అనేది గతంలో ఏపి చరిత్రలోనే లేదు. ఆహార కొరత, విద్యుత్ కొరత, గ్యాస్ కొరత, నీటి కొరత విన్నాం కానీ, ఇసుక కొరత ఇప్పుడే చూస్తున్నాం. లేని ఇసుక కొరత సమస్యను వైసిపి నేతలే సృష్టించారు. తమ అక్రమార్జనలకు ఇసుకను ఆదాయ వనరుగా చేశారు. ఎరువులు, పురుగు మందుల బ్లాక్ మార్కెటింగ్ గురించి గతంలో విన్నాం. ఇసుక బ్లాక్ మార్కెటింగ్ గురించి ఇప్పుడే చూస్తున్నాం. 5రెట్ల అధిక ధరలకు ఇసుక విక్రయాలు చేస్తున్నారు. తీయాల్సిన దానికన్నా 5రెట్లు తక్కువ తీస్తున్నారు. కృత్రిమ కొరతను ,బ్లాక్ లో విక్రయాలను ప్రోత్సహించారు. విజయవాడ దీక్ష ప్రకటన చేశాక ఇసుక అందుబాటు స్వల్పంగా పెంచారు. 14నుంచి ఇసుక వారోత్సవాల ప్రకటన అందులో భాగమే. వైసిపి నేతలే చెన్నై,బెంగళూరు,హైదరాబాద్ కు ఇసుక అక్రమ రవాణా. లారీ ఇసుక రూ.80వేల నుంచి రూ.లక్షకు అమ్మడం చరిత్రలో ఉందా...? వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి రాజీలేని పోరాటం. భవన నిర్మాణ కార్మికులకు అండగా టిడిపి ఉంటుంది. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి పోరాట కమిటి ఏర్పాటు. ఇసుక కొరతపై బొండా ఉమామహేశ్వర రావు నేతృత్వంలో టిడిపి పోరాట కమిటి ఏర్పాటు. సభ్యులుగా అచ్చెన్నాయడు, రామానాయుడు,వర్ల రామయ్య,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అఖిలప్రియ,ఆలపాటి రాజేంద్ర ప్రసాద్,బండారు సత్యనారాయణ మూర్తి. ఈ నెల 14న ఇసుక దీక్షతో అయినా వైసిపి ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. మొద్దునిద్ర నుంచి వైసిపి నేతలు మేల్కొనాలి.