నవంబర్‌ 14న చంద్రబాబు దీక్ష

నవంబర్‌ 14న చంద్రబాబు దీక్ష
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఇసుక కొరతపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన టీడీపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్‌ 14న దీక్ష చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దీక్షలో టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, మాజీలు పాల్గొంటారని తెలుస్తోంది. దీక్ష అయిన మరుసటి రోజు 15న మంగళగిరిలో నూతనంగా నిర్మించిన టీడీపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం కానుంది.