రైతే దేశానికి వెన్నెముక : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్

రైతే దేశానికి వెన్నెముక


ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్


            విజయవాడ, నవంబర్ 11: రైతుల కష్టాలను అధిగమింపచేసే క్రమంలో వ్యవసాయ దారులకు అవసరమైన పూర్తి సహయ, సహకారాలను అందించవలసిన బాధ్యత నేటి సమాజంపై ఉందని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. వ్యవసాయదారులను ఆర్ధికంగా బలోపేతం చేసే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైయస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ సమ్మన్ యోజన వంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. దేశానికి వెన్నెముక రైతులేనని వారి అభ్యున్నతి విషయంలో మరిన్ని పధకాలను అమలు చేయవలసి ఉందని వివరించారు. విజయవాడ, ది వెన్యూ కన్వేన్షన్ సెంటర్ లో సోమవారం రాజ్యసభ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన క్రాప్ హాలిడే (పంట సెలవు దినం) పుస్తకాన్ని గౌరవ గవర్నర్ ఆవిష్కరించారు.  పుస్తకావిష్కరణ నేపధ్యంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ వివిధ వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ను నిర్ణయించే సమయంలో ఆ మద్దతు ధరలు రైతులకు లాభదాయకతను అందిస్తాయా లేదా అన్న విషయాన్నిదృష్టిలో ఉంచుకోవాలని గవర్నర్ సూచించారు.  


               ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతులు 2000 సంవత్సరంలో పంట సెలవు దినం వంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవటానికి దారితీసిన పరిస్దితులను 'క్రాప్ హాలిడే' పుస్తకం ద్వారా  వెలుగులోకి తీసుకురావటం ముదావహమన్న గవర్నర్ హరిచందన్ పుస్తక రచయిత డాక్టర్ యలమంచిలి శివాజీని ప్రత్యేకంగా అభినందించారు. రైతుల పంట సెలవు నిర్ణయం వల్ల వ్యవసాయ సంక్షోభం నుండి బయట పడటమే కాకుండా, ఆనాటి రైతుల బాధల గురించి పాలకులు తెలుసుకోగలిగారని గవర్నర్ వివరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఐక్యంగా ముందుకు సాగాలని అప్పుడే ఆశించిన ఫలితం సిద్దిస్తుందని గవర్నర్ అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించి, పుస్తక పరిచయం చేసిన ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా సంఘం, రాష్ట్ర హిందీ అకాడమీ అధ్యక్షుడు, పద్మభూషణ్ అచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడతూ రైతుల సమస్యలపై నాడు పార్లమెంటులో నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత యలమంచిలికి దక్కుతుందన్నారు. అచార్య ఎన్ జి రంగా, చరణ్ సింగ్ ల తదుపరి రైతుల కోసం పోరాటాలు చేసిన వారిలో శివాజీది ప్రధమ స్దానమన్నారు.


                పుస్తక రచయిత డాక్టర్ యలమంచిలి శివాజీ మాట్లాడుతూ రైతు సమస్యలపై విభిన్న సందర్భాలలో రాసిన వ్యాసాల సంపుటిని క్రాప్ హాలిడే పేరిట తీసుకురావటం జరిగిందని గవర్నర్ చేతుల మీదుగా దీనిని ఆవిష్కరింప చేసుకోవటం శుభపరిణామమని తెలిపారు. రైతు నేస్తం పౌండేషన్ ఛైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ రైతుల సమస్యలను గుర్తించటంతో వ పాటు వాటికి సానుకూల పరిష్కారాలు చూపిన ఘనత కూడా శివాజీకి దక్కుతుందన్నారు. రైతు ప్రయోజనాలే పరమావధిగా తమ ట్రస్టు నుండి రైతు నేస్తం, ప్రకృతి నేస్తం, పశు నేస్తం పేరిట పుస్తకాలను ప్రచురిస్తున్నామన్నారు.  పొగాకు బోర్డు అధ్యక్షులు యడ్లపాటి రఘునాథ్ బాబు, పొగాకు బోర్డు మాజీ చైర్మన్ డాక్టర్ పి. దయాచారి, కార్యదర్శి అద్దంకి శ్రీధర్ తదితరులు కార్యక్రమంలో ప్రసంగించారు.  పుస్తకావిష్కరణలో భాగంగా పలువురు పొగాకు రైతులను గవర్నర్ సత్కరించి, మెమొంటోలను అందచేసారు. ఆలూరి చంద్రశేఖర్, డాక్టర్ కె. హేమలకు తొలి కృతి స్వీకర్త హోదా దక్కగా గవర్నర్ బిశ్వభూషణ్ వారికి పుస్తకాలను బహుకరించారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Image