డిసెంబర్ 28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్ 

డిసెంబర్ 28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్ 


రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక  శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాస రావువచ్చేనెల   28, 29 తేదీలలో విశాఖ ఉత్సవ్ని ర్వహిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక  శాఖ మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాస రావు తెలిపారు.
సోమవారం నాడు  స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఆయన విశాఖ ఉత్సవ్ పోస్టర్ ను  విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఉత్సవ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు.
 విశాఖ నగరానికి, జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, భారతదేశానికి ముంబై నగరం ఎలాగో, ఆంధ్ర ప్రదేశ్ కు వైజాగ్ అలాంటిదని ఆయన తెలిపారు.
విశాఖ ఉత్సవ్ ను ప్రతిరోజు లక్షమంది పర్యాటకులు సందర్శించే లా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ పెంచేలా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.


  భీమిలి  ఉత్సవాన్ని ప్రతిరోజు దాదాపు  30 వేల మంది  సందర్శించారని తెలిపారు.
ఉత్సవానికి ప్రధాన వేదికగా ఆర్కే బీచ్ ఉంటుందని తెలిపారు.
సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఆర్కే బీచ్ లో ప్రధాన వేదిక,  నోవాటెల్ హోటల్ ఎదురుగా జాతర వేదికను, స్థానిక కళాకారుల కోసం ప్రత్యేకంగా వైయస్సార్  సిటీ సెంట్రల్ పార్క్ లో మరొక వేదికను  ఏర్పాటు చేసినట్టు  తెలిపారు.
స్థానికుల మనోభావాలు గౌరవించేలా, గుర్తించేలా ఉత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.


వైయస్సార్ సిటీ సెంట్రల్ పార్క్ లో ఫ్లవర్ షో  ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
కార్నివాల్లో 10 వేల మంది విద్యార్థులు, 500 మంది జానపద కళాకారులు, వివిధ ప్రభుత్వ శాఖల శకటాలను ప్రదర్శిస్తామని తెలిపారు.
ఆర్కే బీచ్ ప్రధాన వేదిక వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు పర్యాటకులు చూసేందుకు ఎగ్జిబిషన్ స్టాల్స్ ను,  ఫుడ్ కోర్టులను, ఇంకా అమ్యూజ్మెంట్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
జిల్లాలోని యువత వేడుకల్లో పాల్గొనేలా బాక్సింగ్, బాడీ  బిల్డింగ్,
కబాడీ, బీచ్ వాలీబాల్ క్రీడలలో పోటీలను నిర్వహించి, విజేతలకు  బహుమతులు ఇస్తామని తెలిపారు.
ఆధ్యాత్మిక  పర్యాటకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల నమూనాలను పర్యాటకుల కోసం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఎకో  టూరిజం ప్రోత్సహించడానికి గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా  స్టాళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఏటికొప్పాక బొమ్మలు, అరకు కాఫీ,  అనకాపల్లి బెల్లం, మాడుగుల హల్వా, చింతపల్లి చింతపండు    స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు


పర్యాటకుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ,  టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రైవేటు  టూరు ఆపరేటర్ల  సహకారంతో ప్రత్యేక సిటీ టూర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
నగరంలోని అన్ని పర్యాటక స్థలాలను సందర్శించడానికి ప్రజలకు ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు.
బీచ్ రోడ్డులో లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్టు  తెలిపారు.
ఇతర జిల్లాలు, రాష్ట్రాలలో, విదేశాలలో ఉన్న విశాఖ వాసులు  ఈ ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతున్నామని తెలిపారు.


 వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పండుగ వాతావరణంలో ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.


జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు.


నగర పోలీస్ కమిషనర్ ఆర్ కె మీనా మాట్లాడుతూ ఉత్సవాలను సందర్శించడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు,  యు వి రమణ మూర్తి రాజు, కరణం ధర్మశ్రీ, కె. భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.


పర్యాటక శాఖ ప్రాంతీయ  సంచాలకులు రాధాకృష్ణమూర్తి, జిల్లా పర్యాటక అధికారి పూర్ణిమా దేవి ఇతర అధికారులు పాల్గొన్నార


Popular posts
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు
ప్రపంచం అంతా ఈరోజు అంతర్జాతీయ మాతృ దినోత్సం జరుపుకుంటోంది.: నారా లోకేష్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి*
Image
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పాఠశాలల ప్రారంభ నిర్ణయంపై పునరాలోచించాలి* ఏ.బి.వి.పి నేత చల్లా.కౌశిక్.... వింజమూరు, ఆగష్టు 26 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సెప్టెంబర్ 5 నుండి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచించడం సబబు కాదని, వెంటనే ఈ అనాలోచిత నిర్ణయాన్ని ఉపసం హరించుకోవాలని అఖిల భారతీయ విధ్యార్ధి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కౌశిక్ బుధవారం నాడు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సాక్షాత్తూ విద్యాశాఖా మంత్రి కరోనా బారిన పడి బాధపడుతున్నా వారికి బోధపడక పోవడం ఆశ్చర్యకరమన్నారు. జగనన్న విద్యాదీవెన, నాడు-నేడు పధకాల ప్రారంభం, ప్రచార ఆర్భాటాల కోసం పిల్లల జీవితాలను పణంగా పెట్టాలని చూస్తే ఏ.బి.వి.పి చూస్తూ ఊరుకోదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విధ్యార్ధుల తల్లిదండ్రులతో గ్రామ, గ్రామీణ సర్వేను ఏ.బి.వి.పి నిర్వహించిందని కౌశిక్ పేర్కొన్నారు. 82 శాతం మంది తల్లిదండ్రులు పాఠశాలల ప్రారంభ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ఉన్నత విద్య, డిగ్రీ, పి.జీ, విశ్వ విద్యాలయాలలో చదివే విధ్యార్ధులు రోగనిరోధక శక్తి కలవారన్నారు. వారిని కాకుండా కేవలం ముందుగా పాఠశాలల బడులను తెరవడంలో ఆంతర్యమేమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచంలోని పలు దేశాలు ఇలాగే అనాలోచిత నిర్ణయాలు తీసుకున్న పర్యవసానాలలో భాగంగా ప్రారంభించిన కొద్ది రోజులలోనే లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఆన్లైన్ ఫీజుల దందాను అరికట్టడంలో శ్రద్దాసక్తులు లేని రాష్ట్ర ప్రభుత్వానికి పాఠశాలల ప్రారంభానికి ఎందుకంత ఆరాటమన్నారు. కార్పోరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని ఇక ప్రత్యక్షంగా చేసుకోవడానికి ప్రభుత్వం మార్గాలు సుగమం చేయడమేనని కౌశిక్ దుయ్యబట్టారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దందా - ప్రభుత్వ పధకాల ప్రచార దందా రెండూ కలిసి వస్తాయా అని సూటిగా ప్రభుత్వాన్ని నిలదీశారు. రోగ నిరోధక శక్తి తక్కువ కలిగి ప్రస్తుత కరోనా పరిస్థితులను ఎదుర్కోలేని పసిపిల్లలపై ప్రభుత్వ అసంబద్ధ ప్రయోగాలు విరమించుకోవాలని హితువు పలికారు. లేని పక్షంలో ఏ.బి.వి.పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని కౌశిక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Image