ప్రతిభా అవార్డులకు ఎంపికైన వింజమూరు విద్యా కుసుమాలు

ప్రతిభా అవార్డులకు ఎంపికైన వింజమూరు విద్యా కుసుమాలు


వింజమూరు: విద్యారంగంలో విద్యార్ధులను మరింతగా తేజోవంతం చేసే దిశగా ప్రభుత్వాలు ప్రతి యేడాది ప్రధానం చేయనున్న ప్రతిభా అవార్డులకు వింజమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పలువురు విద్యార్ధులు ఎంపికయ్యారు. 2018 - 19 సంవత్సరానికి గానూ 10 వ తరగతికి చెందిన గాలి. శిరీషా, కె. నవ్యశ్రీ, మేకల. చరితాంజలి, లక్ష్మీ ప్రసన్నలు ఈ ప్రతిభా అవార్డులను అందుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు వింధ్యావళి మాట్లాడుతూ తమ పాఠశాలలో ఉపాధ్యాయుల నిరంతర కృషి ఫలితమే ఈ అవార్డులకు ప్రధాన కారణమన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యా భోధన అందించడంలో తాము అహర్నిశలూ శ్రమిస్తుంటామని పేర్కొన్నారు.