అన్నా..అన్నా..అంటూనే బదిలీ చేశారు: చంద్రబాబు

*అన్నా..అన్నా..అంటూనే బదిలీ చేశారు: చంద్రబాబు*


*విజయవాడ: ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను ఆకస్మికంగా బదిలీ చేయడాన్ని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు తప్పుబట్టారు* 


*ఆల్ ఇండియా సర్వీసెస్‌లో పనిచేసేవారిని సాధారణ ఉద్యోగిగా బదిలీ చేయడం ఏంటని ప్రశ్నించారు*


*రాష్ట్రంలో దుర్మార్గపు పాలననడుస్తోందని విమర్శించారు*


*అన్నా.. అన్నా.. అంటూనే బదిలీ చేశారన్నారు. సీఎస్‌ను క్లర్క్ కంటే హీనంగా బదిలీ చేస్తారా? అంటూ ప్రశ్నించారు*


*రాష్ట్రాన్ని నడిపించే మార్గం ఇదేనా? అని చంద్రబాబు నిలదీశారు*