6 న apjf విజయవాడలో ధర్నా

విజయవాడ :
మీడియాపై రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ధోరణికి నిరసనగా ఏపీ ఏపీ జర్నలిస్టుల ఫోరం (ఎపి జెఎఫ్) ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు విజయవాడ దర్న చోక్ లో ధర్న  నిర్వహిస్తున్నాము. వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా జర్నలిస్టులపై ఆయా శాఖల ప్రభుత్వ కార్యదర్శులకు కేసులు నమోదు చేసే అధికారం కల్పిస్తూ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్ణయం చేయడం  మీడియా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇదే తరహాలో విడుదల చేసిన జీవో 2043 ను జర్నలిస్టులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు . గత o లోవైఎస్ఆర్ అప్పటి అసెంబ్లీలో ఆ జివో 938 జివో ఉపసంహరించుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఇప్పటి ప్రభుత్వం అదే జీవోకు మరింత పదును పెట్టి 2043 జీవో జారీ చేసి మీడియాపై బెదిరింపు ఆలోచన చేయడం సరికాదు . గతంలోనే ఉపసంహరించిన జీవో 938 మళ్లీ కొనసాగించ రాదు . మీడియాపై కేసులు పెట్టే అధికారం కార్యదర్శులకు ఇస్తూ రాష్ట్ర మంత్రి మండలి చేసిన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తుని లో జర్నలిస్టు హత్య, చీరాల. శ్రీకాకుళంలో జర్నలిస్టుల పై దాడులకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరుతున్నా ము. టీవీ5 ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్స్ పై అనధికారికంగా ఉన్న నిషేధాన్ని తొలగించాలి. ఈ అంశాలపై దర్న జరుగుతుంది. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.  


- చెవుల కృష్ణాo జనేయులు (రాష్ట్ర అధ్యక్షలు)
- మారెళ్ళ వంశీకృష్ణ ( రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)