ఆన్‌లైన్‌లో  69,512 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల

ఆన్‌లైన్‌లో  69,512 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల
శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2020, ఫిబ్ర‌వ‌రి నెల కోటాలో మొత్తం 69,512 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.  ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,112 సేవా టికెట్లు ఉన్నాయి. ఇందులో సుప్రభాతం 7,332, తోమాల 120, అర్చన 120, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాదదర్శనం 2300 టికెట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరిలో 59,400 సేవాటికెట్లు ఉండగా, వీటిలో విశేషపూజ 2,000, కల్యాణం 13,300, ఊంజల్‌సేవ 4,200, ఆర్జితబ్రహ్మోత్స‌వం 7,700, వసంతోత్సవం 15,400, సహస్రదీపాలంకారసేవ 16,800 టికెట్లు ఉన్నాయి.