జర్నలిస్టుల కోసం రాష్ట్రంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
గుంటూరు నవంబర్ 19,(అంతిమతీర్పు) : రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమం ద్రుష్టిలో పెట్టుకొని జర్నలిస్టుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు సాల్మన్ రాజు డిమాండ్ చేశారు. ముందుగా జాబ్ 27 వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు
గుంటూరు జాబ్ మీడియా సెంటర్ నందు జిల్లా అధ్యక్షుడు సాల్మన్ రాజ్ అధ్యక్షతన జరిగిన 27వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం జాప్ 27 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పోరాడుతోందని అన్నారు . జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా ముందుండి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
గుంటూరు జిల్లా జాబ్ ఉపాధ్యక్షులు పేరిచర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ 27 సంవత్సరాలుగా మాజీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నెంబర్ ఉప్పల్ లక్ష్మణ్ కృషితో
జాప్ ముందడుగు వేస్తుందన్నారు. గుంటూరు జిల్లాలో నీ జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించి పదేళ్లలో సీనియారిటీ ఉన్న వారందరికీ నెలకు 10 వేల చొప్పున 40 వయసు దాటిన వారందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జాబ్ కార్యవర్గ సభ్యులు భాను రమేషు సునీల్ షేక్ బాషా సాగర్ చిన్న బాబు చందలూరి నరసింహారావు పోలిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు