సెలవు పై వెళ్లనున్న ఎల్వి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం నెల రోజులపాటు సెలవుపై వెళ్లనున్నారు. డిసెంబరు 6 వరకు ఎల్వీ సుబ్రహ్మణ్యం సెలవు పెట్టారు. మానవవనరుల సంస్థ డీజీగా బాధ్యతలు చేపట్టకుండానే సెలవుపై వెళ్లారు. ఇటీవల ఆయన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి తప్పించిన మానవవనరుల సంస్థ డీజీగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సెలవుపై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది