ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి 
-  శ్రీకాళహస్తి ఎన్జీవో  అధ్యక్షులు చెంచురత్నo
తొట్టంబేడు, నవంబర్ 22,అంతిమతీర్పు.
ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయం వద్ద శ్రీకాళహస్తి తాలూకా యూనిట్ ఎన్జీవో  అధ్యక్షులు సి. చెంచురత్నం ఆధ్యర్యంలో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు . ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎన్జీవో  అధ్యక్షులు చెంచురత్నం మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఎన్జీవో నాయకులు, ఉద్యోగ , ఉపాధ్యాయులు అందరూ కలసి నిరసన నిర్వహిస్తున్నామన్నారు . ప్రభుత్వం నుండి రావాల్సిన 3 విడతల డీఏ ని వెంటనే విడుదల చేయాలని , సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేసారు . అంతేకాకుండా 11వ పీఆర్సీ 55 శాతం ఫిట్ మెంట్ తో అమలు చేయాలన్నారు. కమిటీలతో కాలయాపన చేయకుండా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. మహిళా ఉద్యోగులకు అదనంగా 5 రోజులు సిఎల్ ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు , అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ ఇతర ఉద్యోగుల వలే వారికి ప్రతి నెల వారికీ ఒకటో తేదీ నాటికీ వేతనాలు ఇచ్చేలా జీవో ని వెంటనే విడుదల చేయాలని కోరారు. తొట్టంబేడు తహసీల్దార్ పరమేశ్వర స్వామి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  నిరసన కార్యక్రమంలో శ్రీకాళహస్తి, తొట్టంబేడు ఎన్జీవో నాయకులు,ఉద్యోగ , ఉపాధ్యాయులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.