జెరుసలేం యాత్రికులకు వైసీపీ సర్కార్ శుభవార్త

జెరుసలేం యాత్రికులకు వైసీపీ సర్కార్ శుభవార్త
అమరావతి : జెరూసలేం వెళ్లే యాత్రికులకు వైసీపీ సర్కార్ శుభవార్త చెప్పింది. యాత్రికులకు ఆర్ధిక సహాయం పెంచుతున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. రూ. 3 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న వారికి ఆర్థిక సహాయం రూ. 40 వేల నుంచి రూ. 60 వేలకు పెంచింది. మరోవైపు.. రూ. 3 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్న వారికి ఆర్థిక సహాయం రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. జెరూసలేం యాత్రికుల ఆర్థిక సహాయం పెంపుపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన గత నెల 30వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన విషయం విదితమే.