కడప పర్యటనలో  చంద్రబాబు నేటి కార్యక్రమాలు

కడప పర్యటనలో  చంద్రబాబు నేటి కార్యక్రమాలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబునాయుడు రెండో రోజు మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శ్రీనివాస్‌ కల్యాణ మండపంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ప్రభుత్వ బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. ఉదయం 11.30 నుంచి 1 గంట వరకు కమలాపురం, 1 నుంచి 2.30 గంటల వరకూ ప్రొద్దుటూరు, మధ్యాహ్నం 2.30 - 3.30 సమయం భోజన విరామం. సాయంత్రం 3.30 నుంచి 5 గంటల వరకు పులివెందుల, 5 నుంచి 6.30 గంటల వరకు జమ్మలమడుగు, 6.30 నుంచి 8 గంటల వరకు మైదుకూరు, రాత్రి 8 నుంచి 9.30 గంటల వరకు కడప నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు.