అందువల్లనే ఇసుక తీయలేకపోతున్నాం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం.
తాడేపల్లి
నవంబర్ 04.


పార్టీ రాష్ర్ట అధికారప్రతినిధి,సత్తెనపల్లి శాసనసభ్యుడు శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ 


-నదులు పొంగిప్రవహిస్తున్నాయని పదే పదే చెప్పాం.అందువల్లనే ఇసుక తీయలేకపోతున్నాం అని తెలియచేశాం.


-వరదలు తగ్గాక ఇసుకతీయడం సాధ్యం కాదని చెప్పాం.


-మూర్ఘుల మనస్సులను రంజింపచేయలేం.


-విశాఖలో పవన్ కల్యాణ్ లా...0గ్ మార్చ్ చేశారు.


-అందులో భవననిర్మాణకార్మికులు కనిపించలేదు.


-అందులో జనసేన జెండాలుపట్టుకున్న టిడిపి కార్యకర్తలు కనిపించారు.


-ఆ రెండు కిలోమీటర్లు కూడా నడవలేక కారు ఎక్కారు.అది టివిలలో చూశాం.


-పవన్ కల్యాణ్ మీ రాజకీయాలు మీరు నడుపుకుంటే మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు.


-డిఎన్ ఏ అంటే మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు.డిఎన్ ఏ అంటే చంద్రబాబు,పవన్ కల్యాణ్ ల వ్యక్తిగతమైనది కాదు.


-మళ్లీ చెబుతున్నాను టిడిపి,జనసేన డిఎన్ ఏ ఒక్కటే.


-నిన్న మీరు తాటతీస్తామన్నారు.మీరు రెండు చోట్ల నిలబడితే ప్రజలు తాటతీశారు.మీరు మూలన కూర్చోబెట్టారన్నారే.కాదు మూలనకాదు... కూర్చోబెట్టారు...వంగోబెట్టారు...


-తాటతీయడం అంటే ఆరునెలలకు ఒకసారి గడ్డం తీయడం కాదు.రాజకీయంగా తాటలు తీస్తే తాటలు తీయించుకోవడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టే కాదు ఎవరూ సిద్దంగా లేరు.


-మీ నోరు పెద్దది మీ నోరు కన్నా వేయిరెట్లు పెద్దది మా నోరు గుర్తుపెట్టుకోండి.


-ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తానంటే ప్రజలే మిమ్మల్ని తాటతీస్తారు.తాటిచాపచేస్తారు.దయచేసి మీరు మరిచిపోవద్దు.


-రాజకీయాలలో విమర్శలు చేయండి అవి సద్విమర్శలు చేయాలిగాని వ్యక్తిగతంగా ఉండకూడదు.


-మా వ్యవసాయమంత్రి కన్నబాబుగారిని ఏం మాట్లాడుతున్నారు.మీరు కాకినాడ వెళ్లి కన్నబాబును ఓడించండి అని మీరు కోరితే తుక్కుతుక్కుగా మిమ్మల్ని ఓడించారు.కన్నబాబును గెలిపించారు.


-కన్నబాబు మీ పార్టీలో ఉండిఉండవచ్చు.మీ అన్నగారి పార్టీలో  టిక్కెట్టు ఇచ్చిఉండవచ్చు.అందులో 18 మంది గెలిస్తే వారిలో కన్నబాబు ఒకరు.


-కన్నబాబుపై మీకు హక్కు లేదు.ఈ రాష్ర్టానికి మంత్రిగా ఉన్న కన్నబాబును ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తారా.కన్నబాబు కధ అంతా తెలుసంటారా ఏం తెలుసు మీకు.


-విజయసాయిరెడ్డిగారి గురించి మీరు మాట్లాడారు.రెండున్నరేళ్లు జైలులో ఉన్నారని ,
వారికి మిమ్మల్ని విమర్శించే హక్కు లేదని,జగన్ గారు కూడాప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారని
ఇవన్నీ మీ మాటలు కాదు.అచ్చెన్నాయుడు,అయ్యన్నపాత్రుడు స్ర్కిప్ట్ తీసుకువస్తే చదివే దౌర్భాగ్యపరిస్ధితి .


-ఇంతకుముందు టిడిపి వాళ్లు కూడా అన్నారు.వారందరికి తెలియచేస్తున్నా. జగన్ గారు కేవలం నేరారోపణ చేయబడ్డ వ్యక్తి.16 జైలులో ఉన్నవ్యక్తి.ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్న వ్యక్తి.ఇవన్నీ తెలిసే ప్రజలు ఎన్నికలలో 151 సీట్లలో గెలిపించారు.


-రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డిగారి గురించి అవాకులు చెవాకులు పేలడం మంచిది కాదు.


-రాజకీయంగా వందవిమర్శలు చేయండి వాటికి సమాధానం చెబుతాం.


-చంద్రబాబు సత్తా అయిపోయింది.రాజకీయంగా దాడులు చేయడానికి చేస్తున్నారు అయినా స్పందన రావడం లేదు.


-ఆ మద్య లోకేష్ తో దీక్ష చేయించారు.దానికి సైతం స్పందన లేదు.దాంతో లాంగ్ మార్చ్ పెట్టారు.


-చంద్రబాబు ఎజెండాను మోయడం కోసం మీరు రాజకీయం నడుపుతున్నారు.


-మీ అభిమానులు కూడా జగన్ గారికి ఎందుకు ఓట్లు వేశారంటే మీకు ఓట్లు వేస్తే సైకిల్ కు ఓటు వేసినట్లేనని భావించి మాకు వేశారు.


-చంద్రబాబు ,పవన్ కల్యాణ్ భుజంపై తుపాకి పెట్టి మమ్మల్ని కాల్చాలని ప్రయత్నం చేస్తున్నారు.


-పవన్ కల్యాణ్ , రాజకీయాలలో మీ సొంత ఆలోచనలతో ముందుకు వెళ్లండి.


-మాకు సిధ్దాంతం ఉంది మాకు నైజం ఉందంటున్నారు.ఏంటి మీ సిధ్దాంతం కూలిపోయిన తెలుగుదేశం భవనాన్ని తిరిగి నిర్మించాలనే ప్రయత్నమే మీ సిధ్దాంతం.


-ఢిల్లీలో ఉండే నేతలతో మాకు సంబంధాలు ఉన్నాయి.పలుకుబడి ఉంది అంటారు.పలుకుబడి ఉంటే రాష్ర్ట అభివృధ్దికి కృషి చేయండి.


-ఓ పక్క బిజేపి తో సంబంధాలు నెరుపుతూనే వామపక్షాలతో మాట్లాడుతుంటారు.వారితో కలసి పోటీచేస్తారు.


-మాపై కుట్రతో కేసులు పెట్టారని బావించి ప్రజలు మమ్మల్ని గెలిపించారు.


-పవన్ కల్యాణ్ గారు మీ పార్టీని నడుపుకునే శక్తి లేకపోతే తిరిగి సినిమాలలోకి వెళ్లండి.


-మీరు సినిమాలలోకి వెళ్లి పనిచేసే పరిస్దితి వస్తుంది.


-జగన్ గారు అద్బుతమైన పరిపాలన అందించడం ఖాయం.అందువల్ల మీకు సినిమాలలోకి వెళ్లే ఆలోచన వస్తున్నాయి.


-జనసేన టిడిపికి బి టీమ్ .చంద్రబాబుకు దత్తపుత్రుడు మీరు.


-జనసేనను,టిడిపిని కట్టగట్టి సముద్రంలో పడేశారు.


-చంద్రబాబుకు 23 సీట్లు కాదు 24 సీట్లు అని తేలిపోయింది.


-భవన నిర్మాణ కార్మికులకోసం వారి సంక్షేమం కోసం పాటుపడతాం.


-ఆరునెలల్లోనే జగన్ గారి ప్రభుత్వాన్ని ఏదో బ్రాండ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image