జడ్.పి. హైస్కూలులో పాల్ ల్యాబ్ ప్రారంభోత్సవం
వింజమూరు :
వింజమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధ్యార్ధులకు అధునాతనమైన సాంకేతిక విద్యను అందించేందుకు గానూ పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్ ను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు వింధ్యావల్లి మాట్లాడుతూ ప్రతి చాప్టర్ నందు రివిజన్ సందర్భంగా ట్యాబ్ ల ద్వారా అందించే ఈ నూతన విధ్యా విధానం విధ్యార్ధులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం విధ్యార్ధులకు వీటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చాన్ భాషా, శ్రీనివాసులురెడ్డి, శివకోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు...