విద్యార్థులకు ప్లేట్లు- బిస్కెట్లు పంపిణీ 

విద్యార్థులకు ప్లేట్లు- బిస్కెట్లు పంపిణీ


రాపురు నవంబర్ 16,(అంతిమతీర్పు):


 సీనియర్ జర్నలిస్టు, ఎస్సీ ఎస్టీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు రేవూరు వెంకటస్వామి తండ్రి దివంగత రేవూరు నారయ్య రెండవ వర్దంతి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ప్లేట్లు,  బిస్కెట్లను పంపిణీ చేశారు. రాపూరు  పట్టణంలోని దళితవాడ పాఠశాలల్లోని విద్యార్థులకు 60 ప్లేట్లు, బిస్కెట్లును విద్యార్థులకు వైఎస్ఆర్సిపి యువజన విభాగం నాయకులు రేవూరు రామచంద్రయ్య  పంపిణీ  చేశారు. ఈసందర్బంగా రేవూరు. రామచంద్రయ్య మాట్లాడుతూ తన పినతండ్రి రేవూరు. నారయ్య రెండవ వర్ధంతిని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు ప్లేట్లు,  బిస్కెట్లను చేయడం జరిగిందన్నారు.  సీనియర్ జర్నలిస్ట్ రేవూరు వెంకటస్వామి మాట్లాడుతూ తన తండ్రి స్వర్గియా రేవూరు నారయ్య జ్ఞాపకార్థం ఆయనకు ఇష్టమైన పాఠశాలలోని పిల్లలకు ప్లేట్లు, బిస్కెట్స్ ను ఇవ్వండి జరిగిందన్నారు. అలాగే ప్రతి ఏడాది తన తండ్రి పేరుమీద పిల్లలకు ఏదోఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు.  పాఠశాలలోని 60మంది బాలబాలికలకు ప్లేట్లు, బిస్కెట్లును ఇచ్చామన్నారు.  అదేవిధంగా పిల్లలు చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు పట్లా ప్రేమ, గౌరవం, అలవర్చుకోవాలి అని అన్నారు.


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
అల్లుకుపోతున్న ట్రాన్స్ కో నిర్లక్ష్యం...
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు