వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం
తాడేపల్లి
నవంబర్ 15.
పార్టీ రాష్ర్ట అధికారప్రతినిధి,ఎంఎల్ ఏ శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ కామెంట్స్ ..
-పవన్ కల్యాణ్ ను మించిన మహానటుడు చంద్రబాబు
-ఇసుక కొరతపై చంద్రబాబు చేసింది దొంగ దీక్ష
-ఆరునెలలు అధికారంలేకపోయేసరికి చంద్రబాబు ప్రస్టేషన్ లో ఉన్నారు.వికృత రూపం ప్రదర్శిస్తున్నారు
-14 ఏళ్లు ముఖ్యమంత్రి,పదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నవ్యక్తి ఇసుకదీక్షలో డ్రామాలు ఆడారు.
-పలుగు,పారలు కెమెరాలకు కనబడేలా చేయాలని దీక్షలో కూర్చున్నవారికి చంద్రబాబు డైరక్షన్ చేస్తున్నారు.
-బొచ్చా,పార పట్టుకున్నవారినే కాదు పవన్ కల్యాణ్ తో సైతం బాగా నటింపచేస్తున్నారు.
-చంద్రబాబుకు డబ్బు పిచ్చి పట్టుకుంది. శ్రీ వైయస్ జగన్ గారి గురించి ఇష్టంవచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు.
-151 సీట్లతో శ్రీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే చంద్రబాబు కంగారు పడుతూ అందర్ని కంగారు పడమని చెబుతున్నారు..
-చంద్రబాబూ..శ్రీ వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి పై చర్యలు తీసుకుంటున్నారా లేదా గుండెపై చేయివేసుకుని చెప్పు.
-పొలిటికల్ అవినీతిని అరికట్టాలని జగన్ గారు ప్రయత్నిస్తున్నారు. అలా చేస్తుంటే జే టాక్స్ అని మాట్లాడతారా.మీరు మీ కాలంలో వసూలు చేశారు ఎక్కడపడితే అక్కడ మీ ఎంఎల్ ఏలు మంత్రులు వసూలు చేసారు.
-అధి చూసి మిమ్మల్ని జనం ఛీకొట్టి 23 సీట్లకు పరిమితం చేశారు.
-లిక్కర్ ధర 70 రూపాయలు పెరిగిందంట.దాంట్లోకూడా దోచుకుంటున్నారని మాట్లాడుతున్నారు.
-మేం ఎన్నికలముందు చెప్పినట్లు లిక్కర్ పట్టుకుంటేనే షాక్ కొట్టేలా చేస్తాం.దశలవారీగా మద్యనిషేధం తెస్తామని చెప్పాం.అదే విధంగా నేడు చేస్తున్నాం.
-రాష్ర్టంలో మద్యనిషేధంపై విమర్శలు చేస్తున్నారు.
-అన్నాక్యాంటిన్లు మూసివేశారు కాబట్టి జనం అల్లాడిపోతున్నారని అంటున్నారు.మీరు అన్నాక్యాంటిన్లు తెచ్చింది ఎప్పుడు.
-మేమలా ఎన్నికలకు ముందు పధకాలు తెచ్చి ప్రజలను మోసం చేయలేం.
-50 మంది భవన నిర్మాణకార్మికులు చనిపోయారంట.ఎక్కడ చనిపోయారండి.అధర్మంగా వ్యవహరించకండి.లోకేష్ .చంద్రబాబులు శవరాజకీయాలు చేస్తున్నారు.
-వెనకబడిన వర్గాల వారంటే శ్రీవైయస్ జగన్ గారికి కక్ష అంట కాబట్టి ఇసుక సమస్యను తెచ్చారు అని దారుణంగా మాట్లాడుతున్నారు.
-వెనకబడిన వర్గాల వారు ఎన్టీఆర్ ఉన్నప్పుడు టిడిపికి మధ్దతుగా ఉన్నారు.చంద్రబాబు మోసం చేయడంతో వారంతా శ్రీ వైయస్ జగన్ గారికి మధ్దతు పలికారు.
-చంద్రబాబు ఆదేశాలమేరకు పవన్ కల్యాణ్ నడుస్తున్నారు.
-పవన్ కల్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.
-తాటతీసి మూలన కూర్చోబెడతాను.జగన్ గారు 16 నెలలు జైలులో ఉన్నారు.అంటూ మాట్లాడిన మాటలు వ్యక్తిగతమా.పాలసీలపై మాట్లాడటమా.
-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ కల్యాణ్ కు లేదు.
-ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ను విమర్శిస్తున్న మీకు ఎక్కడనుంచి ప్యాకేజిలు వస్తున్నాయి.
-శ్రీ వైఎస్ జగన్ హిందూవ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
-దివంగత వైయస్ గారు ఏ మతమో శ్రీ వైయస్ జగన్ గారిది అదే మతం కదా.
-పరిపాలనకు, మతానికి ముడిపెట్టి జగన్ గారు హిందూవ్యతిరేకి అని ముద్రవేయడానికి ప్రయత్నిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు.
-జగన్ గారి పాదయాత్రకు ముందు శ్రీవారిని దర్శించుకున్నారు.
-అసలు రాజకీయాలలో మతప్రస్తావన ఎందుకు తీసుకుతెస్తున్నారు.
-చంద్రబాబు హయాంలో సిఎం డౌన్ డౌన్ అంటేనే కేసులు పెట్టారు.మేం అలా చేయడంలేదే.
-ఇప్పటికే ఇద్దరు నేతలు వంశీగారు,అవినాశ్ వు టిడిపి నుంచి డౌన్ అయిపోయారు.
-జగన్ గారికి అటు ఇటు అయితే మీ పరిస్దితి ఏంటి అని పవన్ కల్యాణ్ అడుగుతున్నారు.నీవు, చంద్రబాబు కలసి జగన్ గారిని ఏం చేయదలుచుకున్నారు.
-జగన్ గారికి అటైనా, ఇటైనా, ఎటైనా జగన్ గారి వెంటే నడుస్తాం.
-పదే పదే పెళ్లాలు గురించి మాట్లాడుతున్నారు.మీరు కూడా చేసుకోండి అంటున్నారు
-అయ్యా మీరు తప్పుచేశారని చెబితే, మీరు కూడా తప్పులు చేయండి అని మాట్లాడుతున్నారు.ఇది ఆయన పరిస్దితి.
-మంత్రి బొత్స గారు విమర్శిస్తే 3 నెలల మంత్రి పదవి ఎక్స్ టెన్సన్ వస్తుందంట.అంబటిగారు విమర్శించకపోవడం వల్ల అంబటిగారికి మంత్రి పదవి రాలేదని అంటున్నారు.మా పార్టీ పరిస్దితి అటుంచండి.మీరు జగన్ గారిని పదే పదే విమర్శిస్తున్నారే.
-మీకు ఎక్కడినుంచి ప్యాకేజిలు వస్తున్నాయి.వాటి గురించి ఆసక్తితో మీరు ఎగేసుకుని మాట్లాడుతున్నారు.
-మీ కార్యకర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో పిలిచి అడగండి.మీ చుట్టూ ఉన్న నేతలను మీ గురించి ఏమనుకుంటున్నారో అడగండి.
-తెనాలిబాబు,లింగమనేని బాబులు కలసి మిమ్మల్ని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి ప్యాకేజిలు మాట్లాడిన సంగతి అందరికి తెలుసు.
-చంద్రబాబు ఎవరికి చెబితే వారికి టిక్కెట్లు ఇచ్చి మీ పార్టీని మీరే సర్వనాశనం చేసుకున్నారని అంటుంటే వారిని చూసి జాలివేస్తుంది.
-ఎవరో ఆయిల్ కొడితే మీ బండి నడుపుుకుంటుంటే ఎలా.మీ ఆయిలే మీరు కొట్టుంచుకుని బండినడుపుకుంటే ఎంతబాగుంటుంది.దాని కిక్కే వేరప్ప.
-చంద్రబాబు అధికారంలోకి ఉన్నప్పుడే ఇసుక కొరత వచ్చింది.అది మీరు మాకిచ్చారు.దానిని సరిచేసేందుకు ప్రయత్నించాం.చేసే క్రమంలో ఇబ్బందులు వచ్చాయి.
-ఇసుక ,డబ్బులకో మరోదానికి కక్కుర్తి పడో ఇసుక కొరత సృష్టించామనేది అబద్దం.
-ఇసుక కొరత అనేది కృత్రిమంగా సృష్టంచబడలేదు.ఇసుకనుంచి రాజకీయం తైలం తీయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
-ఇసుక సంగతి అటుంచితే ఇంగ్లీషు భాష గురించి వివాదం సృష్టించారు.ఇంగ్లీషు ప్రవేశపెడితే తప్పేంటి.
-ప్రపంచపోటీని ఎదుర్కొవడం కోసం సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ గారు ఇంగ్లీషు ప్రవేశపెట్టబోతే విమర్శిస్తారా.ఇది సరైన విధానం కాదు.
-జగన్ గారి ప్రభుత్వంపై బురదచల్లాలనే ప్రయత్నం చేస్తే అది సమంజసం కాదు.
-23 క్లైమోర్ మైన్స్ పెట్టినా భయపడలేదని చంద్రబాబు చెబుతున్నారు.వాటికి భయపడలేదుగాని ఒక్కకేసిఆర్ ఓటుకు నోటు కేసుకు భయపడి పారిపోయివచ్చేశావ్.
-అమరావతిలో చంద్రబాబు చేసిన నేరాలు ఘోరాలు బయటకు వస్తాయి.
-పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి చంద్రబాబు తన దూతగా ఏమైనా పంపించి ఉంటాడనేది నా అనుమానం.ఆయన మాత్రం రాష్ర్ట ప్రయోజనాలకోసం వెళ్లాడని నేను భావించడంలేదు.
-ఢిల్లీ వెళ్లివచ్చాక పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లాడో చెప్తాడని ఆశిస్తున్నాను.
-ఇసుక దీక్షకు టిడిపి మెజారిటి ఎంఎల్ ఏలు హాజరుకాలేదు.అది తప్పని ఆ ఎంఎల్ ఏలు భావించి ఉండాలి.