పసుపు జెండా చూడగానే జగన్   ఎందుకు వణికిపోతున్నారు

పసుపు జెండా చూడగానే జగన్   ఎందుకు వణికిపోతున్నారు


చంద్రబాబు కడప జిల్లా పర్యటన సంధర్బంగా పార్టీ శ్రేణులు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించే అధికారం ఎవరిచ్చారుసీఎం సొంత జిల్లాలో తెలుగుదేశంకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీ హడలిపోతోందిముఖ్యమంత్రి సొంత జిల్లాలో  ఇతర పార్టీ జెండాలు, ప్లెక్సీలు కట్టడానికి వీల్లేదా


ప్రజాస్వామ్యంలో  ప్రతిపక్షపార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించే హక్కులేదా 


ఇది ప్రజాస్వామ్యమూ ? లేక రాజరిక వ్యవస్ధా ?


ప్రభుత్వకార్యాలయాలకు, జాతీయ జెండా, మహాత్మా గాంధీ ని వదల కుండా  వైసీపీ రంగులు వేస్తే నోరుమెదపని  అధికారులుతెలుగుదేశం ప్లెక్సీలను అనుమతి లేదంటూ తొలగించటం ఏంటి?  అధికారులు ప్రభుత్వానికి తొత్తులగా పనిచేస్తున్నారా?  ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు అన్న సంగతి అధికారులు గుర్తుంచుకోవాలికళా వెంకట్రావు 
తెలుగుదేశం పార్టీ రాష్ర్ట అధ్యక్ష్యులు