అవినీతి వ్యతిరేక కవితల పోటీ :డాక్టర్ టి. సేవా కుమార్

అవినీతి వ్యతిరేక కవితల పోటీ


గుంటూరు నవంబర్ 5, (అంతిమతీర్పు) :


“అమరావతి సాహితీమిత్రులు”, “సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్” సంయుక్త నిర్వహణలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవినీతి వ్యతిరేక కవితల పోటీ నిర్వహిస్తున్నట్లు సంస్థల సంస్థాపకులు డా. రావి రంగారావు, డాక్టర్ టి. సేవకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 20 పదాలకు మించని పద్య కవిత/వచన కవిత/గేయం ఏదైనా ఒక కవిత మాత్రమే పంపించవలసి వుంటుంది. ప్రథమ బహుమతి రూ.5 వేలు, ద్వితీయ బహుమతి రూ.3 వేలు, తృతీయ బహుమతి రూ.2 వేలు, నాలుగు ప్రత్యేక బహుమతులు రూ.500 చొప్పున ఇవ్వబడతాయి. కవిత వెనకవైపు ఈ పోటీకి కవిత ప్రత్యేకంగా రాసినదని రాసి, చిరునామా, ఫోన్ నంబరు ఇచ్చి సంతకం చేయాలి.   డిసెంబర్ 9 సోమవారం ఉదయం 10 గం.కు గుంటూరు 2/1 బ్రాడీపేట సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశ మందిరంలో జరిగే అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవ సభలో బహుమతు లందించటం జరుగుతుంది. కవితల్ని నవంబర్ 20లోపు అందేలా “డా. రావి రంగారావు, 101, శంఖచక్ర నివాస్, అన్నపూర్ణ నగర్, 5వ లైను తూర్పు, గోరంట్ల, గుంటూరు 522034” అడ్రసుకు పంపాలి.


..... డా. రావి రంగారావు డా. టి.సేవకుమార్ 9247581825