పత్రికల్లో వచ్చిన అసత్య కథనాలను ఖండించిన పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*

 


తేదీ : 06-11-2019,
అమరావతి.


పత్రికల్లో వచ్చిన అసత్య కథనాలను ఖండించిన పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


•  కొన్ని దినపత్రికలలో అదాని, రిలయన్స్ సంస్థలు వెనక్కి వెళుతున్నాయంటూ వచ్చిన వార్తలు, ప్రచారం సత్యదూరం
•  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పారదర్శకత, నిజాయతీ, జవాబుదారీతనానికి కట్టుబడి ముందుకెళుతున్నాం
•  రిలయన్స్ సంస్థకు గత ప్రభుత్వం కేటాయించిన భూములు కోర్టు కేసులో ఉన్నందున ఏపీఐఐసీ ద్వారా ప్రత్యామ్నాయ భూములు కేటాయించనున్నాం
•  ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి 'అదానీ' ప్రతినిధులతో చర్చిస్తున్నాం
   
అమరావతి, నవంబర్ 06 ; రిలయన్స్, అదాని గ్రూప్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెనక్కి వెళుతున్నాయని కొన్ని పత్రికలలో వచ్చిన అసత్య కథనాలపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. అదాని, రిలయన్స్ సంస్థలు వెనక్కి వెళుతున్నాయని వచ్చిన వార్తలు,కథనాలు, ప్రచారంలో వాస్తవం కాదని పరిశ్రమలు,ఐ.టీ, వాణిజ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పారదర్శకత, నిజాయతీ, జవాబుదారీతనానికి కట్టుబడి ముందుకెళుతున్నామని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 


పరిశ్రమలకు ప్రభుత్వం కేటాయించే భూ కేటాయింపుల విషయంలో కొన్ని విధివిధానాలుంటాయన్నారు. 'సులభతర వాణిజ్య విధానం' కోసం 'సింగిల్ విండో విధానం'లో భూ కేటాయింపులు, అనుమతులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.


'రిలయన్స్ సంస్థకు తిరుపతి కేంద్రంగా గత ప్రభుత్వం 136 ఎకరాల భూములు కేటాయించింది, కానీ ఆ ప్రాంత రైతులు సుమారు 15 మంది న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేయడంతో వివాదాస్పదంగా మారింది. కేటాయించిన భూములు వినియోగించకోలేని పరిస్థితి రావడంతో తమ ప్రభుత్వం రిలయన్స్ కోసం మరో భూమిని ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసిందని మంత్రి స్పష్టం చేశారు. ముందు ప్రభుత్వంలోలాగా కాకుండా ఎలాంటి సమస్యలు రాని క్లియర్ టైటిల్ ఉన్న భూమి ఏపీఐఐసీ ద్వారా రిలయన్స్ సంస్థకు ఇవ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రిలయన్స్ సంస్థతో త్వరలోనే చర్చలు జరపనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.


అదాని గ్రూపు విషయానికి వస్తే.. ప్రాజెక్టు ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని, ఆ సంస్థ ప్రతిపాదనలపై ఇప్పటికే ఐ.టీ శాఖ రూపొందించిన ప్రణాళికలు ప్రాసెస్ లో ఉన్నాయని మంత్రి తెలిపారు.  త్వరలోనే దాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అదాని గ్రూప్ తో ప్రభుత్వ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారని మంత్రి స్పష్టం చేశారు.


రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను, ప్రయోజనాలను దెబ్బతీసే అబద్ధపు వార్తలను మీడియా ప్రచారం చేయవద్దని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు సానుకూల వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం అంకితభావంతో ముందుకు వెళుతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. 


 


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image