ఎందుకు రాళ్లు వేశారో టీడీపీనే ఆలోచించుకోవాలి : మంత్రి పిల్లి

ఎందుకు రాళ్లు వేశారో టీడీపీనే ఆలోచించుకోవాలి : మంత్రి పిల్లి
గుంటూరు: రాజధాని అమరావతిలో ఎవరైనా పర్యటించవచ్చునని, ఎవరికి ఎలాంటి అడ్డంకులు ఉండవని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్యాయం జరిగిన రైతులే చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళన చేసి ఉంటారన్నారు. ఎందుకు రాళ్లు వేశారో టీడీపీనే ఆలోచించుకోవాలన్నారు. ఏదోఒక విషయంపై ఆరోపణలు చేసి రాజకీయం చేయాలని టీడీపీ ప్రత్నిస్తోందని మంత్రి సుభాష్ విమర్శించారు. చంద్రబాబు చేసిన అన్యాయంతో రైతులు బాధతో రాళ్లు వేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై రాళ్లు వేసిన ఘటనకు, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాళ్లు వేస్తే వేసి ఉండవచ్చు.. కడుపు మండితే ఎవరైనా వేస్తారన్నారు. రాళ్లు వేసిన ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సుభాష్ చంద్రబోస్ అన్నారు.