టి.ఎన్‌.శేషన్‌ మృతిపట్ల సీఎం సంతాపం

10–11–2019
అమరావతి


టి.ఎన్‌.శేషన్‌ మృతిపట్ల సీఎం సంతాపం


కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి శ్రీ టి.ఎన్‌.శేషన్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సంతాపం వ్యక్తంచేశారు. నిజాయితీకి, నిర్భీతికి, అంకిత భావానికి శేషన్‌ నిలువుటద్దమని, పబ్లిక్‌ సర్వెంట్‌గా శేషన్‌ సేవలు చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. భారత ఎన్నికల కమిషన్‌కున్న శక్తిని ప్రజాస్వామ్య సౌథ నిర్మాణానికి ఎలా ఉపయోగించవచ్చో శేషన్‌ నిరూపించారని శ్రీ జగన్‌ కొనియాడారు. దేశ ప్రజాస్వామ్య  చరిత్రలో శేషన్‌ పేరు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని సీఎం అన్నారు.