జనవరి నుంచి ‘ఈ-ట్రాన్స్‌పోర్టు పర్మిట్‌’

జనవరి నుంచి 'ఈ-ట్రాన్స్‌పోర్టు పర్మిట్‌'
అమరావతి: పంట ఉత్పత్తులు, పశువుల రవాణా, ఎగుమతులకు 'ఈ-ట్రాన్స్‌పోర్టు పర్మిట్‌' విధానం 2020 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీనిపై ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. ప్రస్తుత ఎక్స్‌పోర్ట్‌ పర్మిట్‌ విధానాన్ని నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అయితే, చెక్‌పోస్టుల వద్ద నగదు రూపంలో మార్కెట్‌ ఫీజు చెల్లింపు పద్ధతి 2020 మార్చి 31 వరకు అనుమతిస్తామని, ఏప్రిల్‌ 1 నుంచి ఫీజు చెల్లింపు విధానం, ఈ-ట్రాన్స్‌పోర్టు పర్మిట్‌ల నిర్వహణపై మార్గదర్శకాలను రూపొందించి త్వరలో జారీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలిపారు.