జగన్ పాలన హిట్లర్‌ పాలనను తలపిస్తోంది: యనమల

జగన్ పాలన హిట్లర్‌ పాలనను తలపిస్తోంది: యనమల
పశ్చిమగోదావరి : జగన్ పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ ఒక ఫ్యాక్షనిస్ట్ అని దుయ్యబట్టారు. కేసులతో ప్రతి కోర్టుకు హాజరవుతారని విమర్శించారు. జగన్ కుటుంబ చరిత్ర అందరికీ తెలుసునని అన్నారు. ప్రజాస్వామ్యం అన్నాక నాయకులు ఉద్యమాలు చేస్తారని, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దుర్మార్గం అన్నారు. మంగళవారం దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను యనమల పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. చింతమనేని కళ్లు చింతనిప్పుల్లా ఉంటాయని, అందుకే అధికార పక్షానికి భయం అని వ్యాఖ్యానించారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ మహా నాయకుడేమీ కాదని అన్నారు. వైసీపీ క్యాబినెట్‌లో 80శాతం మంత్రులు, 60శాతం ఎమ్మెల్యేలు నేర చరిత్ర కలిగిన వారే ఉన్నారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీడీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు
వైసీపీ నేతల ఇసుక అక్రమాలను నిరూపిస్తా..