పోతిన మహేష్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం

 విజయవాడల :


భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారికి అండగా నిలబడాలని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు డొక్కా సీతమ్మ ఆహార శిబిరాన్ని పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో చిట్టినగర్ కొత్త అమ్మవారి దేవస్థానం వద్ద 700 మంది భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారాన్ని అందించడం జరిగింది దీనిలో కార్మికులకు చక్రపొంగలి మరియు కట్టెపొంగలి అందించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ఐదు నెలలుగా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసిన వైఎస్ జగన్ గారి ప్రభుత్వానికి కార్మికులు పలుగుల తో పొడిచి పునాదులు కదిలిస్తారని ఇసుకను ప్రజలకు తక్కువ ధర కు అందుబాటులో ఉంచనంత కాలం ఈ సమస్య తీరదని పూటగడవని దుర్భర స్థితిలో నేడు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్న జగన్ ముఖంలో మాత్రం చిరునవ్వులు తగ్గలేదని 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్న వైఎస్ఆర్ సీపీ నాయకులు 36 లక్షల మంది కార్మికులు రోడ్డున పడేశారని దీనిపై ఎందుకు వైఎస్ఆర్ సీపీ నాయకులు మౌనంగా ఉన్నారని రెక్కల కష్టం మీద బతుకుతున్న కార్మికుల రెక్కలు విరిచి ఘనత వైయస్సార్సీపి దేనని జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక కొరత సృష్టించి సిమెంట్ బస్తా కు వంద రూపాయలు పెంచుకునే అవకాశం సిమెంటు సిండికేట్ లకు కల్పించి వేల కోట్ల రూపాయలను సింగిల్ సెటిల్మెంట్ కింద జగన్మోహన్ రెడ్డి గారు పొందే ఏర్పాటు చేసుకున్నారని, YSRCP లో 50 మంది ఎమ్మెల్యేలు 5 ఎంపీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారేనని అట్లాగే నామినేటెడ్ మరియు పరిపాలన లో కీలక పదవులు అన్నీ రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెడుతు ఎస్సీ, ఎస్టీ ,బిసి మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ అధికారం లేని  విస్టింగ్ కార్డు పదవులను ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు చేతికి అందిన ఎంగిలి మెతుకులు లాగా విసురుతున్నారు అని ఈ విషయాన్ని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది  పిళ్ల. శ్రీనివాస్,  వేవిన. నాగరాజు, నాగోతి .సురేష్, తమ్మిన. రఘు, శివ , విజయలక్ష్మి , MD. నూర్, మోబినా, ఇమ్రాన్, ప్రదీప్ రాజ్ , బీరం. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.