*జనం మెచ్చే పాలన.. జనం పాలన.. శ్రీ జగన్ పాలన
*
*పాలకులం కాదు.. సేవకులం అని చాటిచెప్పిన ముఖ్యమంత్రి
*
*అధికారం అలంకారం కాదు.. అధికారం మాకు బాధ్యత
*
*గ్రామ సచివాలయాలు.. ఇక గ్రామ సేవాలయాలు
*
*సేవే పరమావధి.. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా అడుగులు
*
*6 నెలల పాలనలో సంక్షేమానికే అగ్ర తాంబూలం
*
*నవరత్నాలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళల అభివృద్ధే అజెండా
*
*6 నెలల జగన్ మోహనుని జన రంజక పాలన
*
*అన్నమాట నిలబెట్టుకున్నశ్రీ వైఎస్ జగన్*
*సంక్షేమ పథకాల అమలులో.. నాడు తండ్రి డా. వైస్ఆర్ ఒక అడుగు వేస్తే.. నేడు తనయుడు శ్రీ జగన్రెండు అడుగులు..*
*కొత్త పథకాలతో పాటు ఎన్నో కీలక నిర్ణయాలు*
*కులాలు చూడలేదు. మతాలు చూడలేదు.. ప్రాంతాలను, పార్టీలను పట్టించుకోలేదు.. 6 నెలల్లోనే అందరివాడిగా గుర్తింపు తెచ్చుకున్న ముఖ్యమంత్రి శ్రీ జగన్*
*శాచురేషన్ స్థాయిలో అందరికీ సంక్షేమ ఫలాలు*
*అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తూ పాలన ముందుకు..*
*కొత్త ఉద్యోగాలతో లక్షలాది కుటుంబాలలో నవోదయం*
*విద్య, వైద్య రంగాల్లో మార్పులతో సామాజిక విప్లవానికి నాంది*
--------------
*'మా మేనిఫెస్టోనే మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్.. , ఆరునెలల్లోగా మీ అందరిచేత మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా..'అని మే 30,2019 న ప్రమాణస్వీకార వేదికపై
నుంచి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.*
*ఇచ్చిన మాట ప్రకారం.. మొదటి 6 నెలల్లోనే చేతల్లో చూపించారు..
ఆరు నెలల్లోనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 80 శాతం వరకూ అమలు చేసి చరిత్ర సృష్టించిన జననేత.. జనం
మెచ్చిన నేత జగనన్న..
*
*దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ హయాంలో మొదలై ఆ తర్వాత కాలంలో ఆగిపోయిన, గాడి తప్పిన సంక్షేమ పథకాలన్నిటినీ మరింత మెరుగ్గా తీర్చిదిద్ది పట్టాలెక్కించడమే
కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు భరోసా కల్పించేలా అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నారు.*
*ఆ పథకాల్లో మచ్చుకు కొన్ని ఈ క్రింద ఇస్తున్నాం..*
------------------------
*ముఖ్యమైన పథకాలు- నిర్ణయాలు*
---------------
1)'వైయస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్'
ప్రారంభం: అక్టోబరు 15, 2019
వేదిక : నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కాకుటూరు
రైతులకు సాగు పెట్టుబడి కింద ఏటా రూ.13,500 చొప్పున 5 ఏళ్లలో మొత్తం రూ.67,500 ఆర్థిక సహాయం.
- రాష్ట్ర వ్యాప్తంగా 45.82 లక్షల మంది రైతులకు చెల్లింపులు పూర్తి
- మరో 2.14 లక్షల మంది రైతులకు వారం రోజుల్లోగా చెల్లించాలని సీఎం ఆదేశం.
- మొత్తంగా 48 లక్షల మంది రైతులకు భరోసా.
- ప్రభుత్వం రైతులకిస్తున్న డబ్బును బ్యాంకర్లు పాత అప్పుల కింద జమచేయడానికి వీలు లేకుండా అన్ ఇంకబర్డ్ ఖాతాల్లో జమ.
- గ్రామ సచివాలయాల్లో రైతులకు అందుబాటులో నాణ్యమైన పురుగు మందులు, విత్తనాలు. వర్క్‌షాపుల్లో రైతులకు శిక్షణ.
- రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో విత్తన, ఎరువుల పరీక్ష కేంద్రాలు.
- రూ.4 వేల కోట్లతో (కేంద్ర, రాష్ట్రాలు కలిపి) ప్రకృతి వైపరీత్యాల నిధి, అగ్రి కమిషన్, ఆయిల్‌పాం రైతులకు గిట్టుబాటు ధర కోసం నిధుల కేటాయింపు, - కౌలు రైతుల కోసం సాగుదారుల
హక్కుల బిల్లు,
- పంటల బీమా ప్రీమియమ్ చెల్లింపు
పంటల బీమా కోసం 55 లక్షల రైతుల తరపున 56 లక్షల హెక్టార్ల భూమికి సంబంధించి రూ.2164 కోట్లు ప్రీమియమ్‌గా చెల్లింపు
-
రైతులు నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే ప్రీమియమ్‌గా వసూలు.
- ధాన్యం సేకరణలో గత ప్రభుత్వం రూ.960 కోట్లు బకాయి పెడితే, ఆ మొత్తాన్ని ఈ ప్రభుత్వం తీర్చేసింది.
- శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాలుకు రూ.1500 చొప్పున రూ.330 కోట్లు, సహాయం.
పామాయిల్ రైతులకు రూ.87 కోట్లు ఇచ్చి అండగా నిల్చారు.
- ఆవులు, గేదెలు, మేకలు గొర్రెలు చనిపోతే బీమా పరిహారం చెల్లింపు
వ్యవసాయానికి వినియోగించే ట్రాక్టర్లకు రహదారి పన్ను రద్దు.
- ఉచిత పంటల, పశు బీమా, గత ప్రభుత్వ ఇన్‌పుట్ సబ్సిడీ బకాయి రూ. 2 వేల కోట్లు విడుదల, ఇన్‌పుట్ సబ్సిడీ 15 శాతం పెంపు
- వ్యవసాయ ల్యాబ్‌లు, ఉచిత బోర్లు, ప్రతి నియోజకవర్గానికి ఒక బోర్లు వేసే రిగ్గు. మొత్తం 200 రిగ్గులు
- పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్
- ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కే కరెంట్ సరఫరా. ఇందు కోసం రూ.720 కోట్లు విడుదల.
మొత్తం 53,550 మంది ఆక్వా రైతులకు ప్రయోజనం
- ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం,
- రైతులకు వడ్డీ లేని రుణాలు, చిరుధాన్యాల బోర్డు ఏర్పాటు.
------------
2) గ్రామ సచివాలయాలు-ఉద్యోగాల విప్లవం:
ప్రారంభం: అక్టోబరు 2, 2019
వేదిక : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ కరప
- గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా.. రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు.
- ప్రజల పనులు/సమస్యలు 72 గంటల్లో పరిష్కారమయ్యేలా గ్రామ, వార్డు సచివాలయాలు .
- పూర్తి పారదర్శకంగా, అవినీతికి అవకాశం లేకుండా 20 లక్షల మందికి పరీక్షలు సజావుగా నిర్వహణ.
- నాలుగు నెలలు నిండకుండానే 4.10 లక్షల ఉద్యోగాల కల్పన
-ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.40 లక్షల శాశ్వత ఉద్యోగాలు.
గ్రామ వలంటీర్ ఉద్యోగాలు 2.75 లక్షలు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీర్.
- 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి దాదాపు 500 రకాల సేవలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ సచివాలయాల ద్వారా పూర్తి స్థాయిలో అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
--------------
3) దశల వారీ మద్యపాన నిషేదం..
- మహిళల జీవితాల్లో చిచ్చు పెడుతూ.. పేదవర్గాలను ఛిదిమేస్తోన్న మద్యం మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు దశలవారీగా మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాం.
- తొలి ఏడాదే 20 శాతం మద్యం షాపులను తగ్గించి.. సర్కారీ మద్యం షాపులను తెచ్చాం.
- మద్యం అందుబాటులో ఉండే సమయాల్లో కోతలు విధించాం.
- చంద్రబాబు పాలనలో రాష్ట్రం మొత్తమ్మీద 4,380 ప్రయివేట్ మద్యం షాపులు ఉంటే... వీటి స్థానంలో 880 తగ్గించి 3,500 ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేశారు.
-
చంద్రబాబు హయాంలో ఉన్న 44వేల బెల్టు షాపులను పూర్తిగా తొలగించాం.
- మద్యం ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా నిర్ణయాలు.. త్వరలో నూతన మద్యం విధానం అమలు.
- బార్లకూ నూతన విధానం..
ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న బార్లలో 40 శాతం తగ్గించాం.
- గతంలో మొత్తం 797 బార్ షాపులు ఉంటే.. వాటిని 487కు తగ్గించబోతున్నాం. జనవరి 1 నుంచి నూతన బార్ల విధానం అమలు.
-నూతన మద్యం షాపుల పాలసీ వల్ల... గత 2018 అక్టోబరుతో పోలిస్తే 2019 అక్టోబరు నాటికి.. ఆల్కహాల్ వినియోగం 25 శాతం పైన తగ్గింది. బీర్లు వినియోగం 55 శాతం పైన తగ్గింది.
- రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే నిర్వహించే మద్యం దుకాణాల్లో 3,500 మంది సూపర్‌వైజర్లు, 8,033 మంది సేల్స్‌మెన్‌ల నియామకం ద్వారా ఉపాధి కల్పన.
-------------
4) వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ:
- వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు కుటుంబాలకు వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు.
- హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఎక్కడ వైద్యం చేయించుకున్నా పథకం వర్తింపు.
- చికిత్స చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో నిపుణుల కమిటీ సూచన మేరకు రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు ఆర్థిక సహాయం.
- డయాలసిస్ చేయించుకునే వారు, తలసేమియా, సికిల్‌సెల్, హీమోఫీలియా బాధితులకు నెలకు రూ.10 వేల పింఛన్. ప్రమాదాల కారణంగా, పక్షవాతం వల్ల, తీవ్రమైన కండరాల క్షీణత
వల్ల మంచానికే పరిమితమైన వారికి, బోధకాలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్ 3,4,5) నెలకు రూ.5 వేల పింఛన్. కుష్టు వ్యాధిగ్రస్తులకు రూ.3 వేల పింఛన్.
- కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా 'నాడు – నేడు' కింద ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి, ఇందుకు రూ.1,500 కోట్లు కేటాయింపు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్
ఆరోగ్యశ్రీకి రూ.1,740 కోట్లు కేటాయింపు.
- సుమారు 3.5 కోట్ల మందికి లబ్ధి. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కొత్తగా 936 వ్యాధులు. మొత్తంగా 2,031 వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తింపు.
- దేశంలోనే తొలిసారిగా.. చికిత్స చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో
రోగుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ. 26
ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తింపు. డిసెంబరు 1 నుంచి ఆరోగ్యశ్రీ కింది శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్ధిక
సహాయం కింద రోజుకి రూ.225లు చొప్పున.. ఇలా నెలకు గరిష్టంగా రూ.5వేలు
రికవరీ కాలాని ఇస్తారు.
- 40 రోజులు ఆసుపత్రిలో ఉంటే 30 రోజులకు రూ.5 వేలు, మిగతా 10 రోజులకు రోజుకు రూ. 225 చొప్పున ఇస్తారు. మొత్తం 40 రోజులకు రూ. 7,250 ఇస్తారు.
-ఈ మొత్తం రోగి బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది.
- డిసెంబరు 1 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది.
----------------
5) వైఎస్సార్ పెన్షన్ కానుక:
- వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు గత ప్రభుత్వం హయాంలో ఎన్నికల ముందు కొద్ది నెలల వరకూ.. కేవలం రూ. 1000 ఉన్న
సామాజిక పింఛన్ మొత్తాన్ని ఏకంగా రూ. 2,250కు పెంచారు.
- రాబోయే 5 ఏళ్ళలో ఈ పింఛన్ ను రూ. 3 వేలుకు పెంచుకుంటూ వెళతారు. - మే నెల 30న సీఎంగా వైఎస్ జగన్ గారు ప్రమాణం చేసిన వెంటనే.. సామాజిక పెన్షన్లను రూ.2250
పెంచుతూ తొలి సంతకం చేశారు.
- వృద్ధుల పెన్షన్ వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించారు.
- వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద వృద్ధులకు రూ. 2,250, వికలాంగులకు రూ. 3 వేలు పింఛన్.
-------------
6) జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన :
జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన
- జగనన్న విద్యా దీవెన పథకం కింద పేద విద్యార్థులు ఏ చదువు చదివినా పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్.
- జగనన్న వసతి దీవెన పథకం కింద 2019–2020 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి ఆహారం, వసతి ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు అందజేత.
- ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలకూ వర్తింపు.
- ఈ పథకాల కింద 11.44 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి, రూ.5668 కోట్లు కేటాయింపు.
-------------
7) సామాజిక మార్పే లక్ష్యంగా అడుగులు
..
- ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే నవశకానికి శ్రీకారం చుట్టారు.
- ఇందులో ఆ వర్గాల నుంచి ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు.
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం.
- బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం.
- శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ చట్టం.
- ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం.
- ప్రభుత్వ నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం.
- తిరుమల తిరుపతి దేవస్థానం మినహా.. ఆలయ పాలక మండళ్ళలో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు.
--------------------
8) మన బడి నాడు–నేడు
తేదీః 14.11.2019
వేదికః ఏలూరు, పీవీఆర్ గ్రౌండ్స్‌లో పథకం ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్
- మనబడి నాడు–నేడులో భాగంగా 45 వేల 512 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లు కేటాయింపు.
- తొలి దశలో 15,715 పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాలతో అభివృద్ధి.
- ప్రస్తుతం పాఠశాలల ఫొటోలు తీసి.. అభివృద్ధి చేశాక ఫొటోలతో తేడా చూపుతారు.
-
ప్రభుత్వ స్కూళ్లలో రన్నింగ్ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, తాగు నీరు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి అవసరమైన క్వాలిటీ ఫర్నీచర్, తరగతి గదులకు
అవసరమైన మరమ్మతులు, అదనపు తరగతి గదులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీలు, గోడల ఫినిషింగ్, పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్‌ల వంటి కనీసం 9 రకాల సదుపాయాలు కల్పిస్తారు.
----------
9) అవినీతిపై యుద్ధం
- అవినీతి నిర్మూలనతో పేదలకు, సామాన్యులకు లబ్ధి
-అవినీతి లేని సుపరిపాలన కోసం.. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఏర్పాటుకు ఆమోదం.
- అహ్మదాబాద్ ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం.
- రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించేందుకు 14400 కాల్ సెంటర్ ఏర్పాటు.
- ఈ నంబర్‌కు ఫోన్ చేసిన 15 నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి.. చర్యలు.
- ఒక్క ఫోన్ కాల్‌తో మీ వెంట మేమున్నామనేలా ప్రజలకు భరోసా కల్పిస్తారు.
- ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు వివక్షకు, అవినీతికి తావులేకుండా పారదర్శక విధానంలో అందరికీ అందుబాటు.
- గతంలో ఏ పని కావాలన్నా మండల కార్యాలయాలకు ప్రజలు వెళ్లేవారు. అక్కడకు వెళ్తే పనులు కాని పరిస్థితులు వల్ల అవినీతికి, పక్షపాతానికి, వివక్షకు ఆస్కారం ఏర్పడేది.
- అందుకనే అధికార వికేంద్రీకరణ, గ్రామాలకు అందుబాటులో పాలనను తీసుకురావడం, ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారుల గడపకే చేర్చడం అనే లక్ష్యాలను సాధించడానికి గ్రామ,
వార్డు సచివాలయాలను తీసుకు వచ్చాం.
జనవరి 1 నుంచి సచివాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభం..
----
10) స్పందన
- ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారమయ్యేలా ప్రతి సోమవారం 'స్పందన' కార్యక్రమం.
- ఎప్పటిలోగా సమస్య పరిష్కరిస్తారో సూచిస్తూ ప్రతి అర్జీకి రశీదు తప్పనిసరి.
- ప్రతి వారం 'స్పందన' అమలు తీరుపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష .
- అర్జీదారులు సంతృప్తి చెందేలా వ్యవహరించాలని సీఎం ఆదేశం.
---------
11) వైఎస్సార్ వాహన మిత్ర
- ఆటో, క్యాబ్, కార్లు నడుపుకుని జీవించే పేద డ్రైవర్లకు ఆర్థిక భద్రత కల్పించడం కోసం ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం.
- ఈ డబ్బును వాహనాల ఫిట్‌నెస్, బీమా, మరమ్మతుల కోసం వినియోగించుకోవాలి.
- ఇప్పటి వరకు రూ.236 కోట్లతో 2,36,343 మందికి రెండు విడతల్లో ఆర్థిక సహాయం.
------
12) వైఎస్సార్ కంటి వెలుగు
తేదీః 10.10.2019
వేదికః అనంతపురంలో పథకం ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్
- రాష్ట్రంలోని 5.4 కోట్ల ప్రజలకు వివిధ దశల్లో ఉచితంగా కంటి పరీక్షలు
అవసరమైన వారికి శస్త్రచికిత్స, కళ్లద్దాల పంపిణీ.
ఇందు కోసం వచ్చే రెండున్నర ఏళ్లలో రూ.560 కోట్ల
వ్యయం.
తొలి, మలి దశల్లో విద్యార్థులకు కంటి పరీక్ష.
- తొలి విడతగా సుమారు 70 లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించారు. రెండవ విడతలో వీరిలో అవసరమైన వారికి చికిత్స చేయించి, ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ
చేస్తారు.
- ఆ తర్వాత 3, 4, 5, 6 దశల్లో కమ్యూనిటీ బేస్ ఆధారంగా అందరికీ కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వీరికి పరీక్షలు, చికిత్సలు
మొదలవుతాయి.
- తొలి దశలో అక్టోబరు 10 నుంచి 16 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన 62,489 స్కూళ్లలో 70.42 లక్షల విద్యార్థులకు సుశిక్షితులైన 60 వేల సిబ్బందితో కంటి
పరీక్షలు.
- రెండో దశలో మిగిలిన అన్ని స్కూళ్లలో నవంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు 400 బృందాలతో కంటి పరీక్షలు.
- 2020 ఫిబ్రవరి 1 నుంచి 2022 జనవరి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అవ్వా, తాతలతో సహా ప్రజలందరికీ మూడు నుంచి ఆరు దశల్లో కంటి పరీక్షలు.
ఒక్కో దశలో కోటి మందికి
కంటి వైద్య పరీక్షలు.
----------
13) వైఎస్సార్ మత్స్యకార భరోసా
- ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రెండు నెలలు చేపల వేట నిషేధ సమయంలో ఒక్కో కుటుంబానికి ఇచ్చే సహాయం రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంపు. తద్వారా రాష్ట్రంలోని
1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి.
- మర పడవల నిర్వాహకులకు ఇస్తున్న డీజిల్ రాయితీ లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంపు. ఇంజను కలిగిన తెప్పలకూ రాయితీ వర్తింపు. ఒక్కో మర పడవకు నెలకు రూ.27
వేలు, ఇంజను కలిగిన తెప్పలకు రూ.2,700 రాయితీ. ఏడాదిలో పది నెలలకు స్మార్డ్ కార్డుల ద్వారా రాయితీ.
- సముద్రంలో చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి పరిహారం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు. కొత్తగా
మూడు ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండింగ్ సదుపాయాలు. ముమ్మిడివరంలో చమురు నిక్షేపాల అన్వేషణలో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రూ.78.24 కోట్ల పరిహారం
చెల్లింపు.
----------
14) వైఎస్సార్ కాపు నేస్తం
- ఈ పథకం కింద తొలి ఏడాది రూ. 1,101 కోట్లు కేటాయింపు.
- 45 ఏళ్లు దాటిన కాపు మహిళకు ఏటా రూ.15 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల సహాయం.
-----------
15) వైయస్‌ఆర్ నవశకం:
-
వైయస్‌ఆర్ నవశకం పేరుతో డిసెంబరు నెల 20 నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం సాగుతుంది.
- ఈ కార్యక్రమం కింద కొత్తగా బియ్యం కార్డు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు, వైఎస్సార్ పెన్షన్ కానుక కార్డు, జగనన్న విద్యా దీవెన – జగనన్న వసతి దీవెన కార్డులను జారీ చేస్తారు.
- జగనన్న అమ్మఒడి, వైఎస్సార్ కాపు నేస్తం.. రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు రూ.10 వేల ఆర్థిక సాయం.. అర్చకులు, ఇమామ్‌లు, మౌజమ్‌ల గుర్తింపు, వైఎస్సార్ సున్నా వడ్డీ,
నేతన్న నేస్తం, లా నేస్తం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
-
బియ్యం కొత్త కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం
- అర్హులైన వారందరికీ సంతృప్తస్థాయిలో బియ్యం కార్డులు జారీ
- బియ్యంకార్డుల జారీకోసం నిబంధనలను సడలించిన ప్రభుత్వం
- 2008 తర్వాత అర్హతలను మళ్లీ సమీక్షించలేదని, సమీక్ష చేయాలంటూ ప్రభుత్వానికి ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి
ఆమేరకు సడలించిన ప్రభుత్వం
- గతంలో రేషన్ ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,250 ఆదాయం ఉన్నవారికే వర్తిస్తుందని నిబంధనలు పెట్టారు.
- తాజాగా ప్రభుత్వం దీన్ని సడలిస్తూ... గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.12 వేలు లోపు ఉన్నవారికి వర్తించేలా మార్పు.
- గతంలో అర్హులై రేషన్ దక్కని వారినుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వం మళ్లీ కార్డులు జారీచేస్తుంది.
-------------------
16) అగ్రిగోల్డ్:
తేదీః నవంబరు 7, 2019
వేదికః గుంటూరు
- దేశంలోనే తొలిసారిగా.. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ బారిన పడి మోసపోయిన అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాయం చేసింది.
- గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను పట్టించుకోకపోవడంతో దాదాపు 350 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
- అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని ఇచ్చిన హామీ మేరకు.. అధికారంలోకి రాగానే.. తొలి బడ్జెట్ సమావేశాల్లో రూ. 1150 కోట్లు కేటాయించారు.
- తొలి విడతగా రూ. 10 వేల లోపు డిపాజిట్ దారులకు 3.70 లక్షల మందికి రూ. 264 కోట్లు పంపిణీ చేశాం.
- రెండో విడత చెల్లింపుల్లో రూ. 20వేల లోపు డిపాజిటర్లకు పరిహారం అందిస్తారు.
ఇందు కోసం త్వరలోనే రూ.811 కోట్లు విడుదల.
---------
17) రివర్స్ టెండరింగ్: న్యాయ సమీక్ష
-
ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్లో అవినీతికి ఫుల్ స్టాప్ పెడుతూ.. అన్నింటా రివర్స్ టెండరింగ్ విధానం.
రూ. 100 కోట్లు దాటిన ప్రతి పనిపై న్యాయ సమీక్ష
- రివర్స్‌టెండరింగ్ ద్వారా ఆయా ప్రాజెక్టుల్లో దాదాపు రూ.1500 కోట్లు వరకూ ప్రజాధనం ఆదా
- పోలవరంలోనే రూ. 1000 కోట్ల వరకు ఆదా.
- జెన్ కో బొగ్గు రవాణా లో రూ. 186 కోట్లు
-డెస్క్ టాప్ కంప్యూటర్లు, ప్రింటర్ల కొనుగోలులో రూ. 65.47 కోట్లు
-జెన్ కో బొగ్గు పర్యవేక్షణలో రూ. 25 కోట్లు
-4జీ సిమ్ కార్డులు పోస్ట్ పెయిడ్ లో రూ. 33.77 కోట్లు
-పోతురాజు నాలా డ్రైన్ అభివృద్ధిలో రూ. 15.62 కోట్లు
-ఇళ్ళ నిర్మాణంలో రూ. 105.91 కోట్లు
--------------
18)వేతనాల పెంపు:
-
ప్రభుత్వం ఆయా రంగాల్లో పని చేస్తున్న వారికి వేతనాలు పెంచింది.
- ఆశా వర్కర్లకు రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.
- మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు జీతం రూ. 18 వేలకు పెంపు
-బోధన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది వేతనం రూ.16 వేలకు పెంపు.
-హోం గార్డులకు రూ.18వేల నుంచి రూ.21 వేలకు పెంపు.
- వీవోఏ(వెలుగు యానిమేటర్లు) వేతనం రూ.3 వేల నుంచి 10 వేలకు పెంపు.
-108 పైలెట్(డ్రైవర్)కు ప్రస్తుతం రూ.13 వేల వేతనం ఉండగా.. దాన్ని రూ.28 వేలకు, ఈఎంటీ(ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్)కి ప్రస్తుతం రూ.15 వేలు వేతనం ఉండగా.. దాన్ని
రూ.30 వేలకు పెంచారు.
- 104 వాహన ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.17,500 చొప్పున వేతనం ఉండగా, దాన్ని రూ.28 వేలకు, డ్రైవర్‌కు రూ.15,000 వేతనం ఉండగా, దానిని రూ.26
వేలకు పెంచారు.
-మధ్యాహ్నభోజన కార్మిలకు నెలకు రూ.1000నుంచి రూ.3 వేలు జీతం పెంచుతూ నిర్ణయం
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్
-------------
19) పేదలకు నాణ్యమైన బియ్యం
తేదీః 06.09.2019
వేదికః శ్రీకాకుళం జిల్లా పలాసలో కార్యక్రమం. బహిరంగ సభ
- పారదర్శకమైన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సంక్షేమ రాజ్య స్థాపనే లక్ష్యంతో పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం.
- శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 5, 10, 15, 20 కిలోల సంచుల్లో బియ్యం పంపిణీ ప్రారంభం
- నాణ్యత పెంచిన, తినగలిగిన బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా.
- గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా పేద ప్రజల ఇంటి వద్దనే పంపిణీ.
- నాణ్యత కలిగిన నిత్యావసర సరుకుల సరఫరా.
-----------------
20) కొత్త ఇసుక పాలసీ
- గత ప్రభుత్వ పెద్దల దోపిడీ తీరుకు భిన్నంగా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా కొత్త ఇసుక పాలసీ అమలు.
- ఎక్కడా అవినీతికి తావు లేకుండా చెక్‌పోస్టులు, సీసీ కెమెరాల ఏర్పాటు.
- ఇసుక వారోత్సవంలో రూ.60 కోట్లు ఆదాయం.
------------
21)వైఎస్సార్ నవోదయం
తేదీః 17.10.2019
వేదికః అమరావతిలోని క్యాంప్ ఆఫీస్‌లో పథకం ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్
- లక్షలాది మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి.
- గత ప్రభుత్వ నిర్వాకంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన వీటినిఆదుకోవడానికి ఈ పథకం ప్రారంభం. 80 వేల ఎంఎస్‌ఎంఈలకు ఊరట.
- సంక్షోభంలో ఉన్న సంస్థల పునరుద్ధరణతో పాటు, వాటి స్థిరీకరణలో తోడ్పాటు అందించడం పథకం లక్ష్యం.
-
'సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ' (ఎంఎస్‌ఎంఈ), రుణాల ఏకకాల పునర్‌వ్యవస్థీకరణ (ఓటీఆర్).
- ఈ పథకం కోసం రూ.10 కోట్లు విడుదల
----------
22) బాక్సైట్ కు నో
తేదీః
25.06.2019
- విశాఖ జిల్లాలో బాక్సైట్ తవ్వకాలకు గతంలో ఇచ్చిన అనుమతి రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ
-------
23) 'వైయస్సార్ రైతు దినోత్సవం'
తేదీః 08.07.2019
వేదికః వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో బహిరంగ సభలో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్.
- మహానేత వైయస్సార్ జయంతి జులై 8ను వైయస్ఆర్ రైతు దినోత్సవంగా అమలు
-'రైతే రాజుగా రాజన్న రాజ్యం–వ్యవసాయ ప్రగతి ప్రభుత్వ లక్ష్యం' పేరుతో కార్యక్రమాన్నిప్రారంభించిన ప్రభుత్వం.
------------
29) స్థానికులకే 75 శాతం రిజర్వేషన్లు
తేదీః 19.07.2019
పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ తొలి సమావేశాల్లో ముసాయిదా బిల్లుకు ఆమోదం
---------
30)పోలీసులకు వీక్లీ ఆఫ్
- పోలీసులకు దేశంలోనే మొదటి సారిగా వీక్లీ ఆఫ్ (వారంలో ఒక రోజు సెలవు) సౌకర్యం
---------------
31)'వన మహోత్సవం'
తేదీః 31.08.2019
వేదికః గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు, పేరెచర్లలో మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి
- ఈ ఒక్క సీజన్‌లోనే 4 కోట్ల మొక్కలు నాటగా, వన మహోత్సవంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటనున్నట్లు వెల్లడించిన సీఎం.
- మొక్కల పెంపకం కార్యక్రమంలో పండ్ల చెట్లు, నీడనిచ్చే చెట్లు, ఎర్ర చందనం, టేకు మొక్కలు.. ఇలాంటివి అక్షరాలా 12 కోట్ల మొక్కలు నాటడానికి అటవీ శాఖ సిద్ధం
- మరో 13 కోట్ల మొక్కలను పట్టు పరిశ్రమ శాఖ, ఉద్యానవన శాఖతో పాటు, పేపర్ మిల్లులు మొక్కలు నాటనున్నాయని సభలో వివరించిన గౌరవ ముఖ్యమంత్రి.
------------
32)'వైయస్సార్ సంపూర్ణ పోషక పథకం'
తేదీః 26.11.2019
వేదికః అమరావతిలోని సచివాలయంలో ఉత్తర్వులు జారీ
-
రాష్ట్రంలోని ఏడు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లు, 77 షెడ్యూల్డ్, గిరిజన మండలాల్లో పథకం అమలు
- ప్రస్తుతం అమలులో ఉన్న పోషక ఆహార పథకాన్ని పరిశీలించి మహిళలు, పిల్లలకు మరింత పోషకాహారం అందించడం లక్ష్యం
-
పథకానికి సంబంధించి 8 జిల్లాల అధికారులకు మార్గదర్శకాలు
-ఎస్సీలు, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పరిమితిని 100 నుంచి 200 యూనిట్లకు పెంపు
-------
33)రోల్డ్ గోల్డ్ కవరింగ్ యూనిట్లకు కరెంటు ఛార్జీలు తగ్గింపు
ఆయా కంపెనీలకు యూనిట్ విద్యుత్ రేటు రూ.9.20 నుంచి రూ.375కు తగ్గింపు
-
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దాదాపు 250 రోల్డ్ గోల్డ్ కవరింగ్ యూనిట్లకు ప్రయోజనం
- ఆయా కంపెనీల నుంచి తక్కువ విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడం వల్ల ఎదురయ్యే నష్టాలను పూడ్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలకు ఏపీ ఇంధన శాఖ సబ్సిడీ విడుదల చేస్తుంది.
––––––––
34) ఫీజు మానిటరింగ్ కమిటీలు
- రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లు, విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణపై.. మానిటరింగ్ కమిటీల ఏర్పాటు
- తద్వారా ఫీజుల నియంత్రణకు చర్యలు
--------
--------
*రానున్న రోజుల్లో అమలులోకి వచ్చే పథకాలు-నిర్ణయాలు..*
-------------
1). అమ్మ ఒడి (జనవరి 9న ప్రారంభం)
- ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున సాయం.
- 45 లక్షల మంది అమ్మలకు రూ.6,600 కోట్ల పంపిణీకి ఏర్పాట్లు.
- ఈ పథకం వల్ల డ్రాపౌట్లు తగ్గుతాయి.
- పేద కుటుంబంలోని ప్రతి పిల్లాడికి విద్య అందడం ద్వారా ఆయా కుటుంబాలు వృద్ధి చెందుతాయి.
-----------
2) ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీ
- ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు.. భూసేకరణ వేగవంతం.
- మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్.
- అవసరమైతే ఆ ఇంటిమీద పావలా వడ్డీకే బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడం.
-
మార్చి 1 నాటికి కటాఫ్ తేదీగా లబ్దిదార్ల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎం
-
ఇప్పటివరకు 22.7 లక్షల మంది లబ్దిదారులు గుర్తింపు
---------------
3) ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు
- అవినీతికి ఆస్కారం లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం.
- ఉద్యోగులకు పూర్తిగా జీతాలు వచ్చేట్టు చేయడమే ఈ కార్పొరేషన్ లక్ష్యం.
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జనవరి 1 నుంచి ఈ కార్పొరేషన్ ద్వారానే వేతనాల చెల్లింపు.
----------
4) ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అధ్యయనం కోసం ఆంజనేయరెడ్డి కమిటీ ఏర్పాటు.
- సెప్టెంబర్ 3న మధ్యంతర నివేదిక.
- విలీనం ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు.
-----------
5) ఇంగ్లిష్ మీడియానికి ప్రజల మద్దతు
- వచ్చే ఏడాది 1 నుంచి 6వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా కొనసాగిస్తూనే ఇంగ్లిష్ మీడియం.
- ఉపాధి, ఉన్నత విద్యలో పేద పిల్లలు వెనుక బడకుండా ఉండేందుకు దోహదం.
-----------
6) వైఎస్సార్ నేతన్న నేస్తం(డిసెంబర్ 21న ప్రారంభం)
- మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేల సాయం.
- ఇప్పటి వరకు 73,594 మంది లబ్ధిదారుల గుర్తింపు.
-----------
7) వైఎస్సార్ లా నేస్తం (డిసెంబర్ 3న ప్రారంభం)
- జూనియర్ న్యాయవాదులకు మొదటి మూడేళ్ల ప్రాక్టీస్ సమయంలో నెలకు రూ.5 వేల సాయం.
------------
8) వైఎస్సార్ పెళ్లి కానుక (శ్రీరామనవమి రోజు ప్రారంభం)
- ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల చెల్లెమ్మల వివాహానికి రూ.లక్ష సాయం.. బీసీ చెల్లెమ్మల వివాహానికి రూ.50 వేలు సాయం.
-----------
9) వైఎస్సార్ ఆసరా
- పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు. ఇందుకోసం ఈ బడ్జెట్లో రూ. 1,788 కోట్లు కేటాయించారు.
- సున్నా వడ్డీకే రుణం లక్ష్యం రూ.16,819 కోట్లు.
- డ్వాక్రా సంఘాలకు ఎన్నికల నాటికి ఉన్న అప్పుల మొత్తాన్ని నాలుగు విడతల్లో నేరుగా వారి చేతికే ఇస్తారు.
------------
10) వైఎస్సార్ చేయూత
- 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో (రెండవ ఏడాది నుంచి) దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా రూ.75 వేల సాయం.
--------------
--------------
*మరికొన్ని ముఖ్య అంశాలు..*
------------
- పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం.
- ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు గృహ వినియోగ విద్యుత్ ఉచితం.
- పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు.
- వినియోగదారులకు నాణ్యమైన బియ్యం సరఫరాకు శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం.
- స్కూల్ ఎడ్యుకేషన్, హయ్యర్‌ఎడ్యుకేషన్ కమిషన్ల ఏర్పాటు.
- సాలూరు, పాడేరులో గిరిజన వైద్య కళాశాల.
- గిరిజన ప్రాంతాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు శ్రీకారం. అరకు, కెఆర్‌పురం, రంపచోడవరం, పార్వతీపురం, పాలకొండ, దోర్నాలలో ఏర్పాటుకు నిర్ణయం. పౌష్టికాహారం పంపిణీకి
నిర్ణయం.
- పలాసలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, తాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన.
- గిరిజన సలహా మండలి ఏర్పాటు.
- తాగునీటి సరఫరా కోసం వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు శ్రీకారం.
- స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం.
- సఖి.. లైంగిక వేధింపులపై ఉక్కుపాదం.
- సిర్పూర్ కాగజ్ నగర్‌లో పేపరు మిల్లు బాధిత రైతులకు ప్రభుత్వ చెల్లింపులు.
- అర్చకులకు వారసత్వం కల్పిస్తూ ప్రభుత్వ నిర్ణయం.
- మాల, మాదిగ, రెల్లి కార్పొరేషన్ల ఏర్పాటు.
- రాష్ట్రంలో 4 పోర్టుల అభివృద్ధికి చర్యలు
- అవినీతి రహితంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం.
- వైఎస్సార్ ఆదర్శం కింద నిరుద్యోగులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, ఈబీసీ యువతకు వాహనాలు అందిస్తారు. పథకం కింద ట్రక్కుల కొనుగోళ్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనుంది.
లబ్ధిదారుడు రూ.50 వేలు చెల్లిస్తే ట్రక్కు ఇస్తారు.
- లబ్ధిదారులకు నెలకు కనీసం రూ.20 వేల ఆదాయం వచ్చేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం.