యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా..?  

తేది 10-11-2019


 


యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా..?  


       - పీ.ఆర్‌.మోహన్‌ 


 తెలుగు భాష గురించి ఎన్నో గొప్పలు చెప్పుకున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌.. తెలుగు భాష అభివృద్ధికి దేశవిదేశాలలో ప్రచార్యం కల్పించిన మీరు.. గతంలో శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాలు, ఇతరత్రా అవకాశాలకు ఆంగ్ల మాద్యమంలో బోధించే ప్రక్రియను ప్రవేశపెడితే సునామీ వచ్చి పడినట్లు.. తెలుగు భాష చంద్రబాబునాయుడు గారి హయాంలో పాతాళానికి అణగదొక్కబడిందని ఎక్కడపడితే అక్కడ దమ్మెత్తిపోశారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆంగ్ల మాద్యమాన్ని విద్యాలయాల్లో వ్రవేశపెట్టే జీవో తెచ్చినప్పుడు మీ గొంతు మూగబోయిందా..? లేకపోతే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తెలుగు భాషా సంస్కృతి వేదికకు మీరు ఛైర్మన్‌గా పదవిని పొందిన మొహంమాటం కొద్దీ మాట్లాడకుండా ఉన్నారా..?


 ఏ తెలుగు భాష పేరు చెప్పుకొని మీరు ఊరువాడా గళమెత్తి చిందులు వేశారో.. ఇప్పుడు మీరు నిర్వహిస్తున్న  తెలుగు సాంస్కృతిక శాఖ ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు ఇక మీరు తెలుగు భాషకు చేసేది ఏముంది..? చేతికి ఆరోవేలు లాగా మీరు నిరుపయోగంగా మారారా..? తెలుగు భాష ఔన్నత్యంలో, తెలుగు వారి సాంప్రదాయాల విషయంలో అందరిలో గుర్తింపు తెచ్చుకున్న మీరు.. తెలుగు భాషకు మీ నేతృత్వంలో ఘోరమైన నిరాదరణ ఎదురుపడినా.. ఛీఅన్నా, దులబరించుకుని చూరుపట్టుకుని వ్రేలాడే మీలాంటి కుహనసంస్కర్తలు.. తెలుగు భాష పరాన్నజీవులుగా చరిత్రలో మిగిలిపోక తప్పదు. ఇప్పటికే కోట్లాది మంది తెలుగు భాషాభిమానులు.. మీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ వాట్సప్‌లలో, ఫేస్‌బుక్‌లలో, ఎలక్ట్రానిక్‌ మీడియాలో, ప్రింట్‌ మీడియాలో తమ ఆవేదనను వెలిబుచ్చుకున్నారు. కొందరైతే యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు ఏమైంది..? అని నొచ్చుకున్నారు. నేను మీ పంచకట్టు, మీ వాగ్దాటి చూసి గర్వపడ్డాను. ఇప్పుడు మీ విధానాలతో భంగపడ్డాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని తెలుగు భాష ఔన్నత్యం కోసం పరితపించే తెలుగువారి సమావేశాల్లో పాల్గొంటారో..? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 10 కోట్ల తెలుగువారికి ముందుగా క్షమాపణ చెప్పి.. మీ ముక్కును నేలకు రాసి.. జరిగిన తప్పిదానికి చింతిస్తారని ఆశిస్తున్నాను.


  మీ తప్పుడు సమాచారంతో కేంద్ర ప్రభుత్వం ప్రాచీన తెలుగు సాంస్కృతిక అధ్యయన కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేసే విషయంలో మీ ముఖ్యమంత్రి జగన్‌.. తమ ప్రభుత్వమే పై అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయడానికి కృషి, చొరవ చూపినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం. వాస్తవానికి గౌరవనీయ పెద్దలు, యావత్‌ తెలుగువారు అభిమానించి గౌరవించే భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు.. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రివర్యులతో, అధికారులతో సంప్రదింపులు జరిపి  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పై అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించడానికి తగిన అనుమతులు పొందడంలో విశేష కృషి చేయడమేగాక.. నెల్లూరు జిల్లాలోని మనుబోలు కేంద్రంగా నిర్వహిస్తున్న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో సుమారు 6వేల చ.అడుగుల గల భవనాన్ని 5 సంవత్సరాల వరకు ఎలాంటి బాడుగ లేకుండా సదరు సంస్థ నిర్వహించడానికి ఉదారంగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్‌ కార్యాలయాల నిర్మాణానికి.. ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకు సదరు సంస్థ 2ఎకరాల సలం అడిగితే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 5 ఎకరాలు ఇస్తామని ఇప్పటివరకు స్థలం కేటాయించలేకపోవడం నిజమా..? కాదా..? నా ఈ సూటి ప్రశ్నకు సమాధానం చెప్పగలరా..?  


            Sd/-


            పీ.ఆర్‌.మోహన్‌


           శాప్‌ మాజీ ఛైర్మన్‌