బాలికలు పొక్సో చట్టం పై అవగాహన కలిగి ఉండాలి.                    బాలికలు పొక్సో చట్టం పై అవగాహన కలిగి ఉండాలి.                  బాలికలు పొక్సో చట్టం పై అవగాహన కలిగి ఉండాలి :జిల్లా కలెక్టరు .                                                                                                                                                                    :జిల్లా కలెక్టరు .                                                                                                                                                                  :జిల్లా కలెక్టరు .

 


 బాలికలు పొక్సో చట్టం పై అవగాహన కలిగి ఉండాలి.              :జిల్లా కలెక్టరు .


కురబలకోట,నవంబరు 04 :  కౌమార బాల బాలికల సంబంధించి హక్కులు,చట్టాల పై పూర్తి అవగాహనకలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త పేర్కొన్నారు. సోమవారం ఉదయం కురబలకోట మండలం,అంగళ్ళు గ్రామం గోల్డన్ వ్యాలీ స్కూల్ నందు  రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న వైఎస్సార్ కిశోరి వికాసం మూడవ విడత కౌమార బాల బాలికల అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా బాలికల కు సంబంధించి హక్కులు,చట్టాల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు.  బాల్య వివాహాలు,బాలల అక్రమ రవాణా, బాలల పై వేధింపులు,బాలికలో రక్తహీనత,ఋతుక్రమ పరిశుభ్రత, సఖి విమన్ హెల్ప్ లైన్ 181,సఖి వాన్ స్టాప్ సెంటర్లు,మహిళ మిత్ర మరియు సైబర్ మిత్ర అంశాలపై అవగాహన  పెంచుకొని మీ తోటి బాలికలకు అవగాహన పెంచే విధంగా మీరు తయారుగా  ఉండాలన్నారు. బాలికల  హక్కుల  గురించి తెలుసుకోవాలని అప్పుడే సమాజం లో బాలికల పై జరిగే అక్రమాలు అన్యాయం పై ప్రశ్నించవచ్చునని. బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల కలిగే నష్టలు గురించి తెలియజేయాలన్నారు.ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే వెంటనే మీ సమీపం లో ఉన్న పోలీసు అధికారులకు లేదా మండల తహశీల్దార్ లకు ఐ సి డి ఎస్  సంబంధిత అధికారుల సమాచారం అందజేసి బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని. బాల్య వివాహాలు గురించి పిల్లలకు వారి తల్లిదండ్రులు బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి అవగాహన చేయాలని సూచించారు.బాలికల అక్రమ రవాణా జరుగుతుంటే వెంటనే పోలీసు అధికారులకు లేదా 1098,181,100 నెంబర్లకు ఫోన్ చేసి తెలపాలన్నారు. అపరిచిత వ్యక్తలకు,ప్రేమ ప్రలోభాలకు ఆడ పిల్లలు దూరంగా ఉండాలన్నారు.బాలికలలో ముఖ్యంగా  మూడు రకాల వేధింపులు జరుగుతుంటాయి. శారీరక, మానసిక, లైంగిక వేధింపులు జరుగుతుంటాయిని తెలిపారు.లైంగిక నేరాల నుండి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం  2012 సంవత్సరం పొక్సో చట్టం   తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి ఏడు సంవత్సరాలు తక్కువ కాకుండా జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. బాలికల చట్టాల గురించి మీరు అవగాహన పొంది మీ చుట్టుపక్కల ఉన్న పాఠశాల కళాశాల లో బాలికలకు అవగాహన చేయాలని సూచించారు.
        ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ ఎక్కడైనా ఆడపిల్లకు అన్యాయం జరిగితే తోటి బాలబాలికలు వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని తెలిపారు.ఆడ పిల్లల కోసం అనేక చట్టాలు ఉన్నాయని వాటిని అందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలికలపై జరిగే విషయాలకు సంబంధించి కర పత్రాలను విడుదల చేశారు.       
         ఈ కార్యక్రమంలో మదనపల్లె సబ్ కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, శిక్షణ కలెక్టర్ పృథి తేజ్, సి డి పి వో లు స్కూల్ కరస్పాండెంట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.