సుప్రీంకోర్టు తీర్పుపై బీజేపీ స్పందన..

అయోధ్య రామ జన్మ భూమి పై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుపై బీజేపీ స్పందన.."


విజయవాడ.,నవంబర్ 9,(అంతిమతీర్పు):


సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన అమూల్యమైన '' శ్రీరామ జన్మభూమి అంతిమ తీర్పును'' భారతీయ జనతా పార్టీ సగౌరవంగా స్వాగతిస్తోంది అని జాతీయ కార్మిక సంస్థ చైర్మన్,భాజపా రాష్ట్ర కార్యదర్శి శ్రీ జయప్రకాష్ నారాయణ వల్లూరు తెలిపారు.
 భారత దేశ చరిత్రలో నిలిచిపోయే ఈ తీర్పు అన్ని సమస్యలను పరిష్కరించడమే కాకుండా శాంతి, ఐక్యత, సామరస్యం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పింది అని మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు శ్రీరామ జన్మభూమిపై తుది తీర్పు వెలువరించడానికి ముందు
భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం గౌరవాన్ని కాపాడుతూ సమాజంలో అన్ని వైపులనుంచి శాంతి కాంక్షించారు..  సామాజిక, సంసృతిక  సంస్థలు మరియు ఈ వ్యాజ్యనికి సంభందించిన అన్ని పార్టీల వారు శాంతి స్థాపనకు సహృద వాతావరణ కల్పనకు కృషి చేసిన వారిని ఆయన అభినందించారు..  తీర్పు వెలువరించిన అనంతరం కూడా అవే శాంతియుత కొనసాగాలని విజ్ఞప్తి చేశారు.ఇదే భారతదేశ ఔనిత్యానికి ప్రతీక అని జె. పి కొనియాడారు.
నిర్దేశించిన సమయానికి నిర్ణయాత్మకమైన తీర్పు అందించిన గౌరవ సుప్రిం ధర్మాసనానికి, ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని న్యాయమూర్తుల ధర్మాసనానికి భారతీయ జనతా పార్టీ కృతజ్ఞతలు తెలియచేస్తోంది అని రోజువారీ విచారణలు చేపడుతూనే అనేక సంవత్సరాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యకు సుప్రిం ధర్మాసనం నేడు పరిష్కారం చూపింది అని జెపి తెలిపారు
దేశ సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక భావాలను ఐక్యంగా ఉంచిన దేశ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నమస్కరిస్తోంది..
ఈ నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతించాలని, పుకార్లపై శ్రద్ధ చూపకుండా సమానత్వం, సామాజిక సామరస్యం మరియు శాంతితో ఉండాలని అమూల్యమైన వారసత్వాన్ని కాపాడాలని, భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. ఈ నిర్ణయం భారతీయులం ఐక్యంగా ఉన్నామని, భారతదేశంలో ప్రజాస్వామ్యం యొక్క మూలాలు చాలా బలంగా ఉన్నాయని స్పష్టమైన సందేశం ఇచ్చింది.భారతీయ జనతా పార్టీ రామ మందిర నిర్మాణానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. పాలంపూర్ ఆదివేషన్ నుండి ఈ రోజు వరకు కూడా బిజెపి ఈ అంశంపై సానుకూల పాత్ర పోషించింది మరియు ప్రతీ బాధ్యతను నిర్వర్తించింది. దేశ చరిత్రను తిరిగి వ్రాసినప్పుడల్లా, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పదవీకాలం బంగారు అక్షరాలతో వ్రాయబడుతుంది అని జయ ప్రకాష్ నారాయణ హర్షం వ్యక్తం చేశారు.