మూతబడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభిస్తాం: కన్నబాబు
విశాఖ : మూతబడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. ఏజెన్సీలో బాస్మతి ధాన్యం సాగుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రైతుల నుంచి నేరుగా ఏపీ సీడ్స్ విత్తనాలు కొనుగోలు చేస్తోందన్నారు. వ్యవసాయశాఖ అధికారులు మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యాలయాల్లో కాకుండా రైతులతో పొలాల్లో ఉండాలని సూచించారు. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని కన్నబాబు తెలిపారు.
మూతబడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభిస్తాం: కన్నబాబు