శ్రీసిటీని సందర్శించైనా వ్యాపార వేత్తల బృందం

అంతిమతీర్పు - శ్రీసిటీ 


శ్రీసిటీని సందర్శించిన వ్యాపారవేత్తల బృందం


 


శ్రీసిటీ, నవంబర్ 6, 


     ఐదుగురు సభ్యులతో కూడిన వ్యాపారవేత్తలు మరియు సీఈవోల బృందం బుధవారం శ్రీసిటీని సందర్శించింది. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వారికి సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు.


       ఈ పర్యటన పట్ల సంతోషం వ్యక్తం చేసిన శ్రీసిటీ ఎండీ, వివిధ రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రముఖుల ఈ పర్యటన తమకు చాలా ప్రత్యేకమైనది అన్నారు. చిన్న మధ్య భారీ పరిశ్రమలకు వేదికైన శ్రీసిటీలో వీరి అభిప్రాయాలు సూచనలు చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీని సందర్శించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాలని ఆయన ఈ సందర్భంగా వారిని అభ్యర్థించారు.


           ఈ బృందంలో చెన్నై టిఎస్ఎం గ్రూప్ కే.మహాలింగం, చెన్నై ఐపాత్ టెక్నాలజీస్ శ్రీనివాసన్ రామకృష్ణన్, అమెరికా కాలిఫోర్నియాకు చెందిన రకుతెన్ inc సుందర్ కృష్ణమూర్తి, అమెరికా జార్జియాలోని కాక్స్ కమ్యూనికేషన్స్ Inc బాల ilango, అమెరికా కాలిఫోర్నియాకు చెందిన అబోడ్ systems సీతారామన్ నారాయణ పాల్గొన్నారు. వీరు శ్రీసిటీ పరిసరాలు చుట్టి చూడడంతో పాటు సి టి సి, ఫాక్స్కాన్, hunter douglas పరిశ్రమలను సందర్శించారు.


          అనంతరం శ్రీసిటీ ట్రిపుల్ ఐటీ కళాశాల సందర్శించిన ఈ బృందానికి ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కన్నాభిరాన్ సాదర స్వాగతం పలికారు. పరిశ్రమల అనుబంధంతో ఇక్కడ అమలు చేస్తున్న రీసెర్చ్ అనుబంధ విద్యా విధానాన్ని వివరించారు. విద్యార్థులు ఈ సందర్భంగా వ్యాపారవేత్తల బృందంతో పరస్పర చర్చల్లో పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు.