స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్‌ సమీక్ష

05–11–2019
అమరావతి


అమరావతి: స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష 
మంత్రులు ఆదిమూలపు సురేష్, ఆళ్లనాని, అధికారులు హాజరు
స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు –నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నాం: సీఎం
దాదాపు 45వేల స్కూళ్లను నాడు – నేడు కింద బాగుచేస్తున్నాం: సీఎం
తర్వాత దశలో జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్‌ కాలేజీలు, ఐటీఐలు, గురుకులపాఠశాలలు, హాస్టళ్లను కూడా బాగు చేస్తున్నాం: సీఎం
దీనికోసం భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నాం: సీఎం
ప్రతి పాఠశాలలో టాయిలెట్స్, కాంపౌండ్‌వాల్, ఫర్నిచర్, ఫ్యాన్లు, బ్లాక్‌బోర్డ్స్‌ పెయింటింగ్, ఫినిషింగ్‌.. ఇలా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం:
నాడు– నేడు కింద స్కూళ్లలో 9 రకాల పనులు చేపడుతున్నాం:
ప్రతి స్కూల్లో చేపట్టాల్సిన పనులపై చెక్‌ లిస్టు ఉండాలి:
నవంబర్‌ 14న స్కూళ్లలో నాడు–నేడు ప్రారంభం అవుతుంది:
నాడు–నేడులో విద్యా కమిటీలను భాగస్వాములను చేస్తున్నాం:
స్కూళ్లకు సంబంధించిన పరిపాలన అంశాల్లోనే కాదు, నిర్వహణలో కూడా పిల్లల తల్లిదండ్రులతో కూడిన విద్యాకమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి:
వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకూ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నాం:
దీనికి సంబంధించి పాఠ్యప్రణాళిక రెడీచేయాలి:
స్కూలు ప్రారంభంకాగానే వారికి యూనిఫారమ్స్, బూట్లు, పుస్తకాలు ఇవ్వాలి:
స్కూలు తెరిచిన తర్వాత సెప్టెంబరు,  అక్టోబరు వరకూ పుస్తకాలు ఇవ్వని పరిస్థితి ఉండకూడదు:
వచ్చే ఏడాది 9 తరగతిలో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నాం:


అలాగే నాడు – నేడు కింద అన్ని ప్రభుత్వాసుపత్రులనూ బాగు చేస్తున్నాం:
సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రులు కూడా బాగు చేస్తున్నాం:
ప్రతి ఆస్పత్రిలో కూడా మందుల కొరత లేకుండా చూడాలి:
510రకాలకు పైగా మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటాయి:
డిసెంబర్‌ 15 నుంచి కూడా ఈమందులు అందుబాటులో పెడుతున్నాం:
నాడు– నేడు కార్యక్రమంలో ఇది చేస్తున్నాం:
నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు ఉండాలి:
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ప్రమాణాలు బాగా పెరగాలి:


వచ్చే మే నెల నాటికి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సుల పోస్టుల భర్తీ కావాలి:
జనవరిలో దీనికి  సంబంధించి భర్తీకోసం క్యాలెండర్‌ ఇవ్వాలి:


స్కూళ్లలో, పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమానికి సంబంధించి సరైన ప్రణాళిక ఉండాలి: సీఎం
దీనికి సంబంధించి ఆర్థిక వనరులు లోటు లేకుండా చూసుకోవాలి:
మండలంలోని మంచి హైస్కూల్‌ను జూనియర్‌కాలేజీగా అప్‌గ్రేడ్‌ చేయాలి: 
సీఎం
అలాగే విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండేలా చూడాలి:
సంక్రాంతి నాటికి ఈ పని పూర్తిచేస్తామన్న అధికారులు 
ప్రతి విడతలో నాడు– నేడు కింద గ్రామీణ, గిరిజన, మున్సిపాల్టీల్లో స్కూళ్లు ఉండేలా చూసుకోవాలన్న సీఎం, ఆమేరకే ప్రణాళిక తయారుచేశామన్న అ«ధికారులు
స్కూలు యూనిఫారాల దగ్గర నుంచి ఫర్నిచర్‌ వరకూ నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్న ముఖ్యమంత్రి


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image