రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా మిత్రులకు మనవి..*

 



*రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా మిత్రులకు మనవి..*


పగలు రాత్రి తేడా లేకుండా అలుపెరగని సైనికుల్లా వార్తల సేకరణలో నిత్యం బిజీగా ఉండే జర్నలిస్టులకు మరోసారి ఆటవిడుపు


 కాస్త రిలాక్సేషన్, రిఫ్రెష్ మెంట్ కోసం రాజధాని లో రెండో విడత  క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలని నిర్ణయించాం. 


*జనవరి 10, 11, 12 తేదీలలో ఎపి 'జర్నలిస్ట్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ లీగ్'* తరఫున  ACA క్రికెట్ మైదానంలో రెండవ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు మా నిర్వాహక టీం‌ సిద్దమైంది. 


మరి ఆడేందుకు మీ క్రీడా టీం లు కూడా ప్రణాళిక సిద్దం చేసుకోండి..


 క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జట్లను ఆహ్వానిస్తున్నాం.


టీం సభ్యుల వివరాలను .. ప్రతి జిల్లాలో ఉన్న ప్రెస్ క్లబ్ నుంచి..‌ వారి లెటర్ హెడ్  ద్వారా, ఫోన్ ద్వారా నిర్వాహకులకు పంపిన టీం నే ఆడేందుకు అనుమతి ఉంటుంది. 


ఈ‌ టీం సభ్యులకు గత మూడేళ్లల్లో ఉన్న అక్రిడేషన్ నెంబరు ఆడే సమయంలో చూపించాలి


వ్యక్తిగతంగా వచ్చి టీం లు ఆడే అవకాశం లేదు.. మీ మీ జిల్లాల్లో ప్రెస్ క్లబ్ నుంచి టీం జాబితా తెచ్చుకోవాలి


 *డిసెంబరు 10 2019 లోపు తమ పేర్లు నమోదు చేసుకోగలరు*.


 పేర్లు నమోదు చేసిన జట్లు క్రికెట్ కిట్లు తెచ్చుకోవలెను. బాల్స్ మాత్రమే నిర్వాహకులు అందజేస్తారు. 


టోర్నీలో పాల్గొనే జట్టులో 16 మంది ఆటగాళ్ల ఉండాలి. జట్లకు సంబంధించిన డ్రెస్ నిర్వాహకులు అందిస్తారు.


 నిత్యం పని ఒత్తిళ్ల నుంచి సేదతీరేందుకు ఈ టోర్నీ నిర్వహిస్తున్నాం. 


స్నేహ పూరిత వాతావరణంలో పోటీలు జరిగేలా సహకరించగలరని కోరుతున్నాం.
 
*నోట్:*


*టోర్నీలో పాల్గొనేందుకు కేవలం అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులు మాత్రమే అర్హులు*


*టోర్నమెంట్ కు సంబంధించి ఏ విషయమైనా తుది నిర్ణయం నిర్వాహకులదే*


మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి, పేర్లు నమోదు చేసుకోవడానికి ఈ కింది నంబర్లలో సంప్రదించగలరు.


కాంటాక్ట్:


క్రాంతి: 9010678678,
పూర్ణ.. 9393403999, ప్రసాద్ : 8333933318


శ్రీనివాస్ : 9848888284, జగదీష్ :- 9908020454