జనఆమోదం పొందితేనే పార్టీలైన ప్రభుత్వాలకైనా మనుగడ

జనఆమోదం పొందితేనే పార్టీలైన ప్రభుత్వాలకైనా మనుగడ


అర్పిఐ (అత్వాలే) పార్టీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు  కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి
విజయవాడ, నవంబర్ 5,(అంతిమతీర్పు);
జన ఆమోదం పొందితేనే పార్టీలకైనా ,ప్రభుత్వాలకైనా మనుగడ ఉంటుందని  రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అత్వాలే) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అన్నారు.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అత్వాలే) రాష్ట్ర కార్యకర్తల సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు విజయవాడ (మిడిసిటీ)స్థానిక హోటల్లో  రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది.
సమావేశానికి ముఖ్య అధితులుగా కర్ణాటక అర్పిఐ రాష్ట్ర జనరల్ సెక్రటరీ  జీ సి వెంకటరమణ ప్ప, తెలంగాణ అర్పిఐ రాష్ట్ర వర్కింగ్  ప్రెసిడెంట్ ఏం.ప్రభుదాస్ హాజరయ్యారు.సమావేశంలో  మొదట డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ ,పూలే దంపతులకు రాష్ట్ర నాయకులు నివాళులు అర్పించారు. సమావేశంలో రాష్ట్ర 13 జిల్లాల నుంచి  హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి  రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను గుర్తించి ,సమస్యలపై ప్రజల ను  చైతన్యవంతం చేసినప్పుడే అర్పిఐ పార్టీకి ప్రజల్లో గుర్తింపు వస్తుంది అన్నారు.జన ఆమోదం  పొందితేనే పార్టీల,ప్రభుత్వ మనుగడ ఉంటుందన్నారు.పార్టీని బలోపేతం చేసే క్రమంలో  జిల్లాల వారిగా, అందుకు తగిన ప్రణాళికల
పై  సమావేశంలో చర్చించడం జరిగిందన్నారు.ముఖ్య అదితి కర్ణాటక అర్పిఐ జనరల్ సెక్రటరీ వెంకట రమనప్ప మాట్లాడుతూ  దేశ ములో  అధిక జనాభా బడుగు బలహీన వర్గాల ప్రజాలున్న ఇంకా ఎంతో వెనుకబడి ఉన్నారని అన్నారు.ప్రజలకు రాజ్యాంగం పరంగా డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ ఎన్నో హక్కులు కల్పించి ఉన్నా ప్రభుత్వాలు మెజారిటీ ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు.సమావేశంలో  తెలంగాణ రాష్ట్ర అర్పిఐ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుదాస్,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరీ ఏడుకొండలు,మహిళ నాయకురాలు అనంత రాణి, అర్పిఐ ఉత్తరాంధ్ర ఇంచార్జి ధూపం సత్యం,గుంటూరు జిల్లా నాయకులు విష్ణు మొలకల వెంకటేశ్వర రావు,వరలక్ష్మి, యూత్ నాయకులు చిలకా బసవయ్య,వెంకటేశ్వర రావు,డాక్టర్ ప్రసాద్ రావు,తదితరులు పార్టీ అభివృద్ధికి తగిన సూచనలు చేశారు,సమావేశంలో గజల్ వినోద్,చిలకా బసవయ్య తదితరులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.