ఫాస్టాగ్‌ ఎన్నెన్నో ప్రశ్నలు!*

*🔊ఫాస్టాగ్‌ ఎన్నెన్నో ప్రశ్నలు!**🚘నివృత్తి చేసిన ఎన్‌హెచ్‌ఏఐ ఏపీ ఆర్వో అనిల్‌ దీక్షిత్‌*


*🚙తెలుసుకుంటే సులభమిక ప్రయాణం*


 


*🚗ప్రస్తుతం కారున్న ప్రతి యజమాని మదిని వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే... ఫాస్టాగ్‌. దీన్ని ఎక్కడ, ఎలా పొందాలి... వాడుకునేదెలా... తీసుకోకుంటే ఏమవుతుంది... ఏ వాహనాలకు మినహాయింపు ఉంటుంది... ఇలా ఎన్నో సందేహాలు... వీటన్నింటినీ భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఏపీ ప్రాంతీయ అధికారి(ఆర్వో) అనిల్‌ దీక్షిత్‌ ముందుంచింది  ఈ అనుమానాలన్నింటికీ సమాధానాలు వివరంగా..*


*🌀ఫాస్టాగ్‌ను ఇప్పటికే ప్రయోగాత్మకంగా 2014 నుంచి వివిధ జాతీయ రహదారుల మీద అమలు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్‌ప్లాజాల్లో కొన్నిలైన్లలో తప్పనిసరి చేశారు. ఈ డిసెంబరు 1 నుంచి ఒక్క లైన్‌ మినహా మిగిలినవన్నీ ఫాస్టాగ్‌కే కేటాయిస్తారు. అంటే... నగదు చెల్లించే వాహనదారులకు ఒక్క లైనే మిగులుతుంది. ఈమేరకు వాహనదారులను అప్రమత్తం చేస్తూ ప్రతి టోల్‌ప్లాజా వద్ద బ్యానర్లు  కనిపిస్తున్నాయి.* 


*🍥ఎందుకీ ఫాస్టాగ్‌..?*


*🌀టోల్‌ప్లాజాల వద్ద వాహనం ఆగకుండా వెళ్లిపోయేందుకు వీలుగా ఉపయోగపడే చిన్న సాంకేతిక సాధనమే ఈ ఫాస్టాగ్‌. నగదు రహిత, డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది. చిన్న ఎలక్ట్రానిక్‌ చిప్‌ రూపంలో ఉండే ఈ ఫాస్టాగ్‌ను వాహనం ముందుండే అద్దం లోపలివైపు అతికిస్తారు. మన వాహనం టోల్‌ప్లాజా లైన్‌లోకి రావడంతోనే అక్కడ అమర్చిన ఎలక్ట్రానిక్‌ పరికరం వాహన ఫాస్టాగ్‌ ఐడీ, రిజిస్ట్రేషన్‌ నంబరు, మన పేరును గుర్తించి, ఖాతా నుంచి టోల్‌ రుసుంను ఆన్‌లైన్‌లోనే తీసుకుంటుంది. ఇదంతా 10సెకండ్లలోనే జరిగిపోతుంది.*


*🍥ఎక్కడ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి?**🌀అన్ని టోల్‌ప్లాజాలు, 22 ప్రభుత్వ, ప్రైవేటు, సహకార బ్యాంకుల్లో పొందవచ్చు. త్వరలో ఎన్‌హెచ్‌ఏఐ సొంతంగానూ ఇవ్వనుంది. అమెజాన్‌, పేటీఎంల ద్వారా కూడా బుక్‌ చేసుకోవచ్చు. ఈ చిప్‌ను టోల్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన బ్యాంకు సేల్‌ పాయింట్లలో ఒకసారి రిజిస్టర్‌ చేసుకోవాలి. చిప్‌ పొందడానికి వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌(ఆర్సీ), వాహనదారుడి గుర్తింపు కార్డు జిరాక్సు ప్రతులు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు తీసుకెళ్లాల్సి ఉంటుంది.**🍥తొలిసారి ఎంత చెల్లించాలి. ఆ ఖాతాలో ఎంత నగదు నిల్వ ఉంచుకోవాలి.*


*🌀కారుకు తొలుత రూ.500 చెల్లిస్తే చాలు. అందులో రూ.100 ఫాస్టాగ్‌ రుసుం, రూ.200 సెక్యూరిటీ డిపాజిట్‌, మిగిలిన రూ.200 ఫాస్టాగ్‌ ఖాతాలో టాప్‌అప్‌గా ఉంటుంది. ఈ ఖాతాలో కనీసం రూ.200 ఉండాలి. తర్వాత ఆన్‌లైన్‌లో అవసరమైన మేరకు మన బ్యాంకు ఖాతా ద్వారా రీఛార్జి చేసుకోవచ్చు. ఒక్కో వాహనానికి వేర్వేరు ధరలు ఉంటాయి.*


*🍥బ్యాంకు ఖాతాకు అనుసంధానం ఎలా?**🌀ఫాస్టాగ్‌ తీసుకున్న తర్వాత, ఆండ్రాయిడ్‌ ఫోనులో 'మై ఫాస్టాగ్‌ యాప్‌'ను వేసుకుని, అందులో బ్యాంకు ఖాతా, వాహన నంబర్లను నమోదు చేసుకొని లింకు చేసుకోవచ్చు. ప్రతి టోల్‌ప్లాజా దాటిన తర్వాత వాహనదారుడి మొబైల్‌కి మినహాయించుకున్న రుసుం వివరాలతో సందేశం వచ్చేస్తుంది.*


*🍥ఫాస్టాగ్‌ చిప్‌ ఎంత కాల పనిచేస్తుంది?*


*🌀వాహనం ఉన్నంతకాలం పనిచేస్తుంది. ఒక వాహనానికి తీసుకొని, మరో వాహనానికి మారిస్తే పనిచేయదు. ఫాస్టాగ్‌ను మరో వాహనానికి మార్చి... ఏదైనా టోల్‌ప్లాజా మీదుగా వెళితే... ఆటోమెటిక్‌ వెహికిల్‌ కౌంటింగ్‌ క్లాసిఫికేషన్‌(ఏవీసీసీ) ద్వారా దాన్ని గుర్తించి, తర్వాత టోల్‌ప్లాజాలోకి వెళ్లేసరికే అది బ్లాక్‌లిస్ట్‌లోకి వెళ్లిపోతుంది.*


*🍥ఇప్పుడు ఫాస్టాగ్‌ తీసుకోకపోతే ఏమవుతుంది?**🌀డిసెంబరు 1 తర్వాత టోల్‌ప్లాజాలో కేటాయించిన ఒక్కలైన్‌లో మాత్రమే నగదు చెల్లించి వెళ్లాలి. ఆ మార్గంలో క్యూలో నిరీక్షించక తప్పదు. ఒకవేళ పక్కన ఖాళీగా ఉన్న ఫాస్టాగ్‌ లైన్‌లో నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం రెట్టింపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.*


*🍥మనం వెళ్లే మార్గంలో ఎన్ని టోల్‌ప్లాజాలు ఉన్నాయి, ఎంత నగదు ఫాస్టాగ్‌ ఖాతాలో ఉంచాలన్నది తెలుసుకోవచ్చా.?**🌀ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన 'సుఖద్‌ యాత్ర' అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే అందులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లానుకుంటున్నామో పేర్కొంటే... ఆ మార్గంలో ఎన్ని టోల్‌ప్లాజాలు ఉన్నాయి, ఎంత రుసుం తదితర వివరాల సమాచారం తెలుస్తుంది.*


*🍥టోల్‌ప్లాజా సమీప నివాసితులకు ఇస్తున్న రాయితీలు, నెలవారీ పాసులు కొనసాగుతాయా?*


*🌀టోల్‌ప్లాజాకు 20 కి.మీ. పరిధిలో నివాసం ఉండేవారి వాహనాలకు స్థానిక కోటాలో రాయితీ ఇస్తున్నారు. ఫాస్టాగ్‌ పొందిన వాహనదారులు సంబంధిత టోల్‌ప్లాజాలో వివరాలు తెలియజేస్తే, వారికి గతంలో మాదిరిగా స్థానిక రుసుంనే మినహాయించుకుంటారు. ఒక నెలలో ఎక్కువ ట్రిప్పులు తిరిగే వారికి నెలవారీ పాసులూ ఉంటాయి.*


*🍥రెండు రాష్ట్రాల్లో ఎన్ని టోల్‌ప్లాజాలు ఉన్నాయి. కొత్తవిధానానికి ఎన్ని సిద్ధమయ్యాయి?**🔘ఏపీలో 47 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలో 30 వరకు సిద్ధమయ్యాయి. మిగిలిన వాటిలోనూ ఈనెలాఖరుకు అమలు చేయనున్నారు. తెలంగాణలో ఉన్న 17 టోల్‌ప్లాజాల్లోనూ ఫాస్టాగ్‌ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర రహదారులపైన ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద కూడా ఆగకుండా వెళ్లేందుకు ఫాస్టాగ్‌ విధానం అమలు చేయనున్నారు.*


*🌀అసలు దీనితో ఉపయోగాలేమిటి?**💫టోల్‌ దగ్గర వాహనం ఆగాల్సిన పనిలేదు. దాంతో డీజిల్‌ వినియోగం తగ్గుతుంది. వెంట నగదు తీసుకెళ్లాల్సిన అవసరం, చిల్లర సమస్య ఉండదు. అద్దెకు తిరిగే వాహనాలు, దూర ప్రాంతాలకు వెళ్లే లారీలు, బస్సులు వంటివి ఏయే టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లాయి.. ఆన్‌లైన్‌లో ఎంత నగదు చెల్లింపు జరిగిందనేది వాటి యజమానులు చూసుకోవచ్చు. భారీ వాహనాలకు అదనంగా డబ్బులు తీసుకునే అవకాశం ఉండదు. ఇక ప్లాజాల్లో ఎంత వసూళ్లు జరుగుతున్నాయనే విషయం ప్రభుత్వానికి పక్కాగా లెక్క తెలుస్తుంది. టోల్‌వద్ద సిబ్బంది అవసరమూ తగ్గుతుంది. వీటికి మార్చి నెలాఖరుకు వరకు ప్రతి టోల్‌ చెల్లింపులో 2.5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభించడం అదనం.*


*♻ఎంపీ, ఎమ్మెల్యేల వాహనాల సంగతేంటి?*


 


```రాష్ట్ర పరిధిలో గవర్నర్‌, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, శాసనసభాపతి, మండలి ఛైర్మన్‌, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చెందిన వాహనాలు, కేంద్ర, రాష్ట్ర బలగాలకు చెందిన వాహనాలు, పోలీసుల వాహనాలు (పోలీసులు యూనిఫాం ధరించి ఉండాలి), ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌(కలెక్టర్‌, జేసీ, ఆర్డీవో, తహసీల్దార్‌)ల వాహనాలు, ఆంబులెన్స్‌లకు మినహాయింపు ఉంటుంది.``````మినహాయింపు ఉండే వాహనాలకు ఫాస్టాగ్‌ తీసుకోవాలా?```


```తీసుకోవాల్సిందే. వీరికిచ్చేది జీరో బ్యాలెన్సు ఫాస్టాగ్‌. వీళ్లు తమ వాహన వివరాలతో ఆన్‌లైన్‌లోగానీ, నేరుగా గానీ ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి(ఆర్వో)కి దరఖాస్తు చేసుకుని దీన్ని పొందాలి. రీఛార్జి అవసరం లేకుండానే వీళ్లు ఫాస్టాగ్‌ లైన్‌లో ఆగకుండా వెళ్లిపోవచ్చు.```


```ఒక ప్రజాప్రతినిధికి ఎన్ని జీరో బ్యాలెన్సు ఫాస్టాగ్‌లు ఇస్తారు?```


```ఎంపీలకు వారి రాష్ట్ర పరిధిలో ఒకటి, దిల్లీలో మరొకటి ఇస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఒక్కొక్కటే ఇస్తారు. అది కూడా వారి పదవీ కాలం ఉన్నంత వరకే రాష్ట్ర పరిధిలో మాత్రమే పనిచేస్తుంది.```


*🌀ఓ నాయకుడి వాహనం వెనుక 3, 4 వాహనాలు వెళుతుంటే?*


```ప్రజాప్రతినిధి వాహనానికి అమర్చిన జీరో బ్యాలెన్సు ఫాస్టాగ్‌ ఉన్న వాహనం మాత్రమే సంబంధిత లైన్‌లో నుంచి ఆగకుండా వెళ్లేందుకు వీలుంటుంది. మిగిలిన వాహనాలకు ఫాస్టాగ్‌ లేకుంటే, నగదు చెల్లించే లైన్‌లో వెళ్లి, డబ్బులు చెల్లించి ముందుకెళ్లాలి.```


 


*🌎దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సగటున 23% వాహనదారులు ఫాస్టాగ్‌ తీసుకున్నారు. నెలాఖరుకు అత్యధిక శాతం తీసుకుంటారని అంచనా వేస్తున్నారు.*


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image