జాతీయ స్థాయికి తీసుకు వెళ్లి అందరి మద్దతు కూడగడతాం...

ప్రకాశం :


*ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు కామెంట్స్...*


రాష్ట్ర వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే పిలుపు మేరకు 2430 జీఓకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు...


ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ మద్దతుతో 2430 జీఓను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే వరకు ఉద్యమాలు కొనసాగుతాయి...


ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకు వెళ్లి అందరి మద్దతు కూడగడతాం...


ఢిల్లీలో ఉన్న జర్నలిస్టులను కలసి ఉద్యమిస్తాం...


ఈ జీఓ ను తీసుకురావాల్సిన అవసరం లేదని అందరూ భావిస్తున్నారు...


నిరాధార వార్తలు రాస్తే ప్రభుత్వం కోర్టు కేసులు వేయవచ్చు...


జీఓ ద్వారా ప్రభుత్వం మీద వచ్చే ఆరోపణలు ఎత్తిచూపితే వారిపై కేసులు పెడతామనటం సరైన పద్ధతి కాదు..


ఏపీయూడబ్ల్యూజే చేసే ప్రతీ ఉద్యమానికి ఐజేయూ మద్దతునిస్తుంది...


దేవులపల్లి అమర్ ప్రభుత్వ ప్రతినిధిగా మాత్రమే అభిప్రాయాన్ని ఇచ్చారు, దానికి యూనియన్ కు సంబంధం లేదు...


యూనియన్  దేవులపల్లి అమర్, శ్రీరామచంద్రమూర్తి చేసిన ప్రకటనలను వ్యతిరేకిస్తుంది..


జర్నలిస్టులకు సమాచార మంత్రి కులాలను ఆపాదించటం సహేతుకం కాదు..


బెదిరింపులకు గురిచేసి మీడియాను గుప్పట్లోకి తీసుకోవలనుకోవటం సరైంది కాదు...


రాజన్న రాజ్యం తీసుకు వస్తామని అధికారం లోకి వచ్చిన జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి కన్నా గొప్పవారు కాదు...


జీఓ 2430 పై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతాం...


పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లితే ఏపీయూడబ్ల్యూజే ఐక్య కార్యాచరణతో ముందుకు వెళ్తాం...