సీఎం చేతుల మీదుగా పంపిణీ

సీఎం చేతుల మీదుగా పంపిణీ


అమరావతి,:సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్‌ డిపాజిటర్ల చేతికి డబ్బులు అందబోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ఈ నెల 7న గుంటూరులో చెక్కులు పంపిణీ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మొదటి విడతగా రూ.264 కోట్లు విడుదల చేయడంతో తగిన చర్యలు చేపట్టాలని సీఐడీ అధికారులను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు. విజయవాడ కేంద్రంగా వెలసిన అగ్రిగోల్డ్‌ సంస్థ దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని 19.19 లక్షల మందితో రూ.6,380 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించింది. కాల పరిమితి ముగిసిన బాండ్లకు సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని ప్రాంతాల్లో ఫిర్యాదులు రావడంతో గత ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీఐడీకి అప్పగించింది. సీఐడీ అధికారులు అగ్రిగోల్డ్‌ చైర్మన్‌తోపాటు డైరెక్టర్లు, ఇతర ముఖ్యులను అరెస్టు చేసి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లోని రూ.3,785 కోట్ల విలువైన అగ్రిగోల్డ్‌ ఆస్తులను గుర్తించి జప్తు చేశారు. అత్యధికంగా మన రాష్ట్రంలో రూ.2,585 కోట్ల విలువైన ఆస్తులు జప్తులో ఉన్నాయి. వాటిని వేలంలో విక్రయించి డిపాజిటర్లకు పంపిణీ చేయాలని మూడేళ్ల క్రితం డిపాజిటర్ల సంఘం పేరుతో హైకోర్టులో పిల్‌ దాఖలైంది.
 
హైకోర్టు ఆదేశాల మేరకు ఆస్తుల వేలం ప్రక్రియను జిల్లా కమిటీలతో కలిసి సీఐడీ మొదలు పెట్టింది. డిపాజిటర్లు ఆందోళనకు దిగడంతో గత ప్రభుత్వం రూ.250కోట్లు ఇచ్చి రూ.5వేల లోపు డిపాజిటర్లకు స్వాంతన చేకూర్చేందుకు యత్నించింది. ఎన్నికల తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం రూ.1,150 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడింది. దీంతో సీఐడీ అధికారులు కసరత్తు చేసి ప్రభుత్వానికి వివరాలు అందజేశారు.
ఆ జాబితాను న్యాయకమిటీలకు పంపి ఆ తర్వాత హైకోర్టు అనుమతితో డబ్బు పంపిణీ చేయబోతున్నారు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image