స్వామి నాథన్ దంపతులను కలిసిన మంత్రి మోపిదేవి

 


 


చెన్నై. నవంబర్ 2,(అంతిమతీర్పు) :


 


శ్రీ ఎం.స్. స్వామినాథన్ ని ఈరోజు చెన్నైలోని వారి ఫౌండేషన్ క్యాంపస్ లో మర్యాద పూర్వకంగా కలిసిన మంత్రి మోపిదేవి వెంకటరమణ......


వారితో పాటు ఎం.స్.స్.ఆర్.ఫ్. (M.S. SWAMINATHAN RESEARCH FOUNDATION) ఛైర్మన్ శ్రీమతి. మధురా స్వామినాథన్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  ఆలోచనలను, ఆకాంక్షలను  వారికి వివరించిన మంత్రి మోపిదేవి......


ప్రధానంగా మత్స్యశాఖ పై ముఖ్యమంత్రి  విజన్ ..... ప్రత్యేకంగా మత్స్యకారులును సామాజికంగా మరియు ఆర్థికంగా  బలోపేతం చేయడానికి.... అందునా ప్రత్యేకించి మత్స్యకార కుటుంబంలోని స్త్రీలను ఆర్ధికంగా పరిపుష్టంగా తీర్చిదిద్దే విధంగా చేపట్టవలసిన చర్యలపై ఆయన శ్రద్ధను సవివరంగా తెలియచేసిన మంత్రి.....


కేవలం 5 నెలలలోనే ముఖ్యమంత్రి  పాదయాత్ర లో ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చిన హామీలను... ప్రజాప్రయోజన పధకాలను విసిదీకరించిన మంత్రి......


జగన్ నాకు మంచి ఆప్తుడు అని, అనతికాలంలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నేతగా జగన్మోహన్ రెడ్డి  ప్రధమ స్థానంలో ఉన్నారు అని కితాబు ఇచ్చిన శ్రీ స్వామినాథన్ .


ఇతర రాష్ట్రాలలో చేపట్టినట్టే మన రాష్ట్రంలో కూడా మత్స్య సంపదను అదే విధంగా మత్స్యకారుల జీవితాలలో మంచి మార్పు తీసుకురావడానికి శ్రీ స్వామినాథన్  సలహాలు ..... సూచనలను మరియు ఫౌండేషన్ సహాయ సహకారాలను కోరిన మంత్రి మోపిదేవి.


తాను తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసి  అభివృద్ధి కోసం దోహదపడే సూచనలు చేస్తానని హామీ ఇచ్చిన శ్రీ ఎం.స్. స్వామినాథన్..... అదే విధంగా తమ ఫౌండేషన్ తరఫున అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకుంటామని అన్ని విషయాలలో తమ తోడ్పాటు అందిస్తామని ఛైర్మన్ శ్రీమతి. మధురా స్వామినాథన్ తెలియచేయడం జరిగింది.