వైసీపీ కార్యకర్తలకు తప్ప మిగతా ఎవరికీ రక్షణ లేకుండా పోయింది.

*నెల్లూరులో మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి కామెంట్స్*


🔸రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలకు తప్ప మిగతా ఎవరికీ రక్షణ లేకుండా పోయింది..


🔸చంద్రబాబు నాయుడి అమరావతి పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం కనీస భద్రత కల్పించలేకపోయింది..


🔸దాడులు చేస్తామని వైసీపీ నాయకులు ముందే ప్రకటించినప్పటికీ అదుపు చేయలేకపోయారు..


🔸అదుపు చేయలేకపోగా రాళ్లు, లాఠీలు, చెప్పులతో కాన్వాయ్ పై దాడి చేస్తే.. నష్టపోయిన వారు చేశారని, వారికి ఆ హక్కు ఉందని డీజీపీ వ్యాఖ్యానించడం దురదృష్టకరం..


🔸ప్రజాస్వామ్యంలో ఎవరైనా ముందుగా చెప్పి మరీ రాళ్లు, చెప్పులతో దాడులు చేయవచ్చని డీజీపీని రాష్ట్రంలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలందరికీ ఆదేశాలిచ్చేయమనండి. అందరికీ స్వాతంత్ర్యం వస్తుంది..


🔸మాజీ సీఎం కాన్వాయ్ పై దాడి చేసిన వారిని సాయంత్రానికి బెయిలిచ్చి వదిలేశారు..ఇక సామాన్యుడికి రక్షణ ఎవరు కల్పిస్తారు..


🔸వైసీపీ ప్రభుత్వం వచ్చాక 13 జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది.. నిర్మాణ రంగం దెబ్బతింది. వారంతా ఎవరిపై దాడి చేయాలి..


🔸చంద్రబాబు నాయుడుపై దాడి చేయడమేంటి..అమరావతిలో రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు నష్టపోవడానికి కారణమెవరు..


🔸నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంది..కానీ రాళ్లు, చెప్పులు వేసి కాదు..


🔸రాజధాని ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసి అక్కడి వారి ఆస్తుల విలువ పెంచారు..


🔸వైసీపీ అధికారంలోకి వచ్చాకే రాజధాని ప్రాంతంలో ఆస్తుల విలువల అమాంతంగా పడిపోయింది..అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడుపై దాడి చేస్తారా..


🔸నేదురుమల్లి, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల హయాంలో మేం కూడా నిరసనలు తెలిపి ఉద్యమాలు చేశాం..ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదు..


🔸టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాను. కానీ చెప్పులు, రాళ్లు విసిరి కాదు..


🔸ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపి ఉద్యమాలు నడిపాం..


🔸రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత దిగజారకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, హోం మంత్రి, డీజీపీపై ఉంది..