మంత్రి వెల్లంపల్లి కి.మాట్లాడే అర్హత లేదు : పోతిన వెంకట మహేష్

విజయవాడలో :


 


 జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ  భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన లాంగ్ మార్చ్ లో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ప్రజలు జనసేన పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేసినందుకు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు ముచ్చెమటలు పడుతూ  మూర్చ రోగం వచ్చిందని అందుకనే పవన్ కళ్యాణ్ గారి పై అసత్య ప్రచారాలు చేస్తూ ఇసుక సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని ఇసుక సమస్యపై బలమైన గొంతుగా వినిపిస్తూ బలమైన ఉద్యమం చేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారేన  ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఓటమి చెందిన ముందుండి పోరాడుతున్నది పవన్ కళ్యాణ్ గారేన అందుకనే పవన్ కళ్యాణ్ గారి  నీతి నిజాయితీ సిద్ధాంతాలు భావజాలం అవినీతిపరులకు అర్థంకావని అందుకే  ఇష్టానుసారం అవాకులు, చవాకులు వైఎస్ఆర్సిపి నాయకులు పెలుతున్నారని, అవినీతి యూనివర్సిటీకి వైస్ ఛాన్స్లర్ అయిన విజయ్ సాయి రెడ్డి డైరెక్షన్ లో నడుస్తున్న C.M వైఎస్ జగన్ గారి పాలనలో ఎప్పటికీ పారదర్శకత నీతి ఉండదని ఇసుక విధానం పై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పై అనేక ఆరోపణలు చేస్తున్న ఎందుకు వైయస్సార్ సిపి నాయకులు స్పందించడం లేదని జగన్మోహన్ రెడ్డి గారి  కేసులు బయటికి తీసి జైల్లో కూర్చోబెడతారు అనే భయం  ఉండబట్టే వైయస్సార్ సిపి నాయకులు బిజెపి నాయకుల పై ధైర్యంగా స్పందించడం లేదని మీకు దమ్ముంటే బిజెపి నాయకుల పై విమర్శలు చేయాలని మహేష్ చాలెంజ్ విసిరారు. సిమెంట్ కంపెనీల వద్ద నుండి ఒక్కొక్క సిమెంట్ బ్యాగ్ కు 5 రూపాయల కమిషన్ సెటిల్మెంట్ అయ్యేంతవరకు రాష్ట్రంలో ఇసుక కొరత తీరదని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఓటు వేసినందుకు రాష్ట్ర ప్రజల పశ్చాత్తాప పడుతున్నారని ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తనకే తెలియని రాజకీయ ఊసరవెల్లి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నీతి నిజాయితీ లపై ప్రయాణం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడే స్థాయి అర్హత లేదన్నారు నిజంగా మంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే దేవాలయాల్లో అవినీతి అరికట్టాలని అదేవిధంగా కృష్ణా జిల్లాల నుంచి తరలిపోతున్న ఇసుక అక్రమ రవాణా ఇసుక మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని తద్వారా ప్రజలకు మేలు చేయాలన్నారు.