*06.11.2019*
*అమరావతి*
- *అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచిన శ్రీ వైఎస్ జగన్ సర్కార్.
- *రేపు గుంటూరులో సిఎం శ్రీ వైఎస్ జగన్ చేతుల మీదిగా బాధితులకు చెల్లింపులు.*
- *రూ.10వేల లోపు డిపాజిట్ దారులకు చెల్లింపులు.*
- *తొలి మంత్రివర్గ సమావేశంలోనే అగ్రిగోల్డ్ సమస్యపై నిర్ణయం.*
- *అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించేలా బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు కేటాయింపు.*
- *గత నెల 18న రూ. 263.99 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు.*
- *రాష్ట్రంలోని 3,69,655 మంది మందికి ఊరట.*
- *బాధితుల కన్నీళ్లను తుడుస్తానని ఇచ్చిన హామీకి కార్యరూపం.*
- *అగ్రిగోల్డ్ మోసంతో దగాపడ్డ వారికి న్యాయం చేసే దిశగా అడుగులు.*
- *చంద్రబాబు హయాంలో రోడ్డెక్కిన అగ్రిగోల్డ్ బాధితులు*.
- *ఆదుకుంటానంటూ మభ్యపెట్టిన చంద్రబాబు సర్కార్.*
- *మరోవైపు అగ్రిగోల్డ్ ఆస్తులను మింగేందుకు గత ప్రభుత్వ పెద్దల కుట్రలు*
- *పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను స్వయంగా విన్న వైఎస్ జగన్.*
- *అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానంటూ హామీ*.
- *రూ.20వేల లోపు డిపాజిట్ దారుల చెల్లించేందుకు నిర్ణయం.*
----------------------------------------------------------------------------
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామన్న శ్రీ వైఎస్ జగన్మహన్ రెడ్డి హామీ కార్యరూపం దాలుస్తోంది. అయిదేళ్ల పోరాటంలో అడుగుడుగునా దగాపడ్డ అగ్రిగోల్డ్ బాధితుల కల సాకారమవుతోంది. బాధితుల్లో 3,69,655 మందికి తొలివిడతలో చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ చేతుల మీదిగా గురువారం (7వ తేదీ) డబ్బుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను గట్టెక్కించడానికి... నేనున్నానంటూ ఆనాడు ప్రతిపక్షనేతగా శ్రీ వైఎస్ జగన్ ఇచ్చిన భరోసా నేడు బాధితులకు అండగా నిలుస్తోంది.
*నమ్మించిన సంస్థ నట్టేటముంచింది...*
*ఆదుకోవాల్సిన సర్కార్ అక్రమాలకు తెగబడింది.*
రోజువారీ కష్టం చేసుకునే వారి నుంచి, చిన్నా, మద్యతరగతి వర్గాలను ఆకర్షించిన అగ్రిగోల్డ్ సంస్థ నిబంధనలకు విరుద్దంగా వారి నుంచి 6,380 కోట్ల రూపాయలను సేకరించింది. ఆకర్షనీయమైన వడ్డీరేట్లు, పటిష్టమైన ఏజెంట్ల వ్యవస్థతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు మొత్తం ఏడు రాష్ట్రాల్లో 32 లక్షల మంది నుంచి డిపాజిట్లు సేకరించింది. విజయవాడ కేంద్రంగా అవ్వా వెంకటరామారావు, మరికొందరు డైరెక్టర్లతో కలిసి 1995లో ఏర్పడిన 'అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్' అనతి కాలంలోనే వేలకోట్ల రూపాయలను ప్రజల నుంచి సేకరించి, పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసింది. వివిధ రకాల స్కీంలలో సేకరించిన డిపాజిట్లకు నగదును, భూములను ఇస్తామని చెప్పి వాటిని అందించలేకపోయింది. చివరికి మోసపోయామని గ్రహించిన డిపాజిట్ దారులు పోలీసులను ఆశ్రయించడంతో ఏపితో పాటు పలుచోట్ల అగ్రిగోల్డ్ యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కష్టజీవుల నుంచి మధ్యతరగతి మహిళలు పొదుపుగా దాచుకున్న మొత్తాల వరకు డిపాజిట్ల రూపంలో అగ్రిగోల్డ్ కు చేరాయి.
*ఆస్తులను మింగేందుకు గత సర్కార్ కుట్రలు...*
*బాధితులకు అండగా వైఎస్ఆర్ సిపి...*
అవసరానికి ఆదుకుంటాయని భావించిన సొమ్ము కాస్తా... తిరిగి రాదని గ్రహించిన అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలంటూ గత అయిదేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వంకు పదేపదే విన్నవించుకున్నారు. ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కార్ నుంచి స్పందన లేకపోవడం, మరోవైపు గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలే బినామీ పేర్లతో వున్న అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించడం వివాదాస్పదం అయ్యింది. అగ్రిగోల్డ్ బాధితులు సంస్థ ఆస్తులను అమ్మి, తమకు చెల్లింపులు చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందంటూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిపక్షంలో వున్న వైఎస్‌ఆర్ సిపి వారి ఉద్యమానికి అండగా నిలిచింది. అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీని ఏర్పాటు చేసి అప్పటి చంద్రబాబు సర్కార్ కుట్రలను అడ్డుకుంది. ఇదే క్రమంలో ప్రజాసంకల్ప పాదయాత్రలోనూ అడుగుడునా అగ్రిగోల్డ్ బాధితులు ప్రతిపక్షనేత శ్రీవైఎస్ జగన్ ను కలిసి తమ కష్టాలను వివరించారు. న్యాయం చేయాల్సి ప్రభుత్వమే తమ కష్టాన్ని కాజేయాలని చూస్తోందని మొరపెట్టుకున్నారు. వారి బాధలను విన్న శ్రీ వైఎస్ జగన్ తమ ప్రభుత్వం రాగానే ప్రాధాన్యతా క్రమంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు.
*అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటిని తుడిచే చర్యలు...*
వైఎస్‌ఆర్ సిపి అధికారంలోకి రాగానే జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేసే నిర్ణయంపై తీర్మానం చేశారు. మొదటి బడ్జెట్ లోనే బాధితుల కోసం 1,150 కోట్ల రూపాయలను కేటాయిస్తూ తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఇప్పటికే న్యాయస్థానాల పరిధిలో అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయ ప్రక్రియలో జాప్యం కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుగానే బాధితులకు చెల్లింపులు చేయాలనే నిర్ణయాన్ని కార్యరూపంలోనికి తీసుకువచ్చారు. 10వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు చెల్లింపులు చేసేందుకు గతనెల అక్టోబర్ 18వ తేదీన 263.99 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కెఆర్‌ఎం కిషోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో ఒక్కసారిగా అగ్రిగోల్డ్ బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల పరిధిలో ఒకేసారి చెల్లింపుల ద్వారా 3,69,655 మందికి న్యాయం జరుగుతోంది. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ(డీసీఎల్) ప్రతిపాదనల ప్రకారం జిల్లాల వారీగా ఈ సొమ్మును బాధితులకు అందచేయనున్నారు. అలాగే ఇరవై వేల రూపాయల లోపు వున్న మరో 4లక్షల మంది డిపాజిట్ దారులకు కూడా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా వున్నట్లు అధికారులు చెబుతున్నారు.
------------------------------------------------------------------
జిల్లాల వారీగా అగ్రీగోల్డ్ బాధితులకు తొలిదశ పంపిణీ వివరాలు:
------------------------------------------------------------------
జిల్లాలు: బాధితుల సంఖ్య రూ.చెల్లించే మొత్తం
------------------------------------------------------------------
విశాఖపట్నం: 52,005 45,10,85,805
విజయనగరం 57,941 36,97,96,900
శ్రీకాకుళం 45,833 31,41,59,741
పశ్చిమ గోదావరిజిల్లా 35,496 23,05,98,695
తూర్పుగోదావరిజిల్లా 19,545 11,46,87,619
కృష్ణాజిల్లా 21,444 15,04,77,760
గుంటూరుజిల్లా 19,751 14,09,41,615
ప్రకాశం జిల్లా 26,586 19,11,50,904
నెల్లూరుజిల్లా 24,390 16,91,73,466
అనంతపురం 23,838 20,64,21,009
వైఎస్ఆర్ కడప 18,864 13,18,06,875
కర్నూలు 15,705 11,14,83,494
చిత్తూరు జిల్లా 8,257 5,81,17,100
---------------------------------------------------------------------